Eyes: సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అన్ని ఇంద్రియాల లో కళ్ళు అతి ముఖ్యమైనది గా పరిగణిస్తారు. మరి అలాంటి కళ్ళను భద్రంగా ఉంచుకోవాలంటే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పొడి కన్ను చాలా మందికి దీర్ఘకాలికంగా వేధించే సమస్య కళ్ళల్లో తగినంత నీరు లేకపోవడం కారణంగా కన్నీళ్లు ఉత్పత్తి అవ్వవు పొడి కళ్ళలో ఉండే ముఖ్య లక్షణాలలో చికాకు, మంట ఉండటం ఎక్కువ సమయం పాటు స్క్రీన్ ని చూడడం కష్టంగా ఉంటుంది. నేత్ర వైద్య నిపుణుల ప్రకారం కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే..తగినంత పోషకాహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు వివిధ వ్యాధులను అరికట్టాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం…

చేపలు:
పొడి కళ్ళు తగ్గాలంటే చేపలు తినడం వల్ల ఉపశమనం కలుగుతుంది.చేపలలో ఒమేగా ఎక్కువగా ఉంటాయి. ఇది కంటిలో ముఖ్యంగా కన్నీటి నాళాలలో మంటను తగ్గిస్తుంది.
ఆకుకూరలు:
ఆకుకూరల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి తోడ్పడే పోషకం విటమిన్ సి ఒక యాంటీ ఆక్సిడెంట్ ఇది వృద్ధాప్యం వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కంటి సమస్యను తగ్గిస్తుంది.
గుమ్మడికాయ గింజలు:
చియా గింజలు ప్లాక్స్ సీడ్ వంటి విత్తనాలు ఒమేగా కొవ్వు ఆమ్లాల కలిగి ఉండే మంచి మూలకాలు. చేప నూనె ఇతర చేపల ఆధారిత ఒమేగా సప్లిమెంట్లకు ప్రత్యామ్నాయంగా తరచుగా ఉపయోగించవచ్చు. శాకాహారులకు చేపల కన్నా గొప్ప ప్రత్యామ్నాయం.
నీరు:
మన కంటిని ఆరోగ్యంగా ఉంచడంలో నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది. పుష్కలంగా నీరు తాగడం వల్ల కళ్ళు పొడిబారకుండా నిరోధిస్తాయి.హైడ్రేట్ గా ఉండడం మీ ఆరోగ్యానికి కూడా మంచిది.కాబట్టి ప్రతిరోజు తగినంత నీరు తాగాలి.
బీన్స్:
బీన్స్ అనేగా ముఖ్యమైన పోషకాలను కలిగి వీటిని తినడం వల్లచక్కటి ఆరోగ్యం లభిస్తుంది. ఇవి మాంసానికి గొప్ప ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. బీన్స్ లో పోలేట్ మరియుజింక్ ఉంటాయి. ఇది మెలనిన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. మెలనిన్ కళ్ళను దెబ్బ తినకుండా కాపాడుతుంది.