మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మంచి ఊపు మీదున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం లో వస్తున్న క్రాక్ సినిమాని సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తానని ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేసేశాడు. దాంతో ఇప్పుడు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న హీరోలందరు తమ సినిమాలని మళ్ళీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అదే గనక జరిగితే రాం పోతినేని నటించిన రెడ్, నాగ చైతన్య లవ్ స్టోరీ, అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్.. ఇలా చాలా సినిమాలు బరిలో దిగే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమా కంప్లీట్ చేస్తున్నే రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అన్న సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీద ఉంది. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమా మ్యూజికల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. డింపుల్ హయాతి మీనాక్షి దీక్షిత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే నేను లోకల్, సినిమా చూపిస్త మావ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న త్రినాథ రావ్ నక్కిన దర్శకత్వంలో కూడా రవితేజ ఒక సినిమా చేస్తాడని అంటున్నారు.
కాగా గత కొన్ని రోజులుగా రవితేజ ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 లో నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరున్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ మీదకి వచ్చింది. కాగా ఈ సీక్వెల్ లో మరో హీరో ఉన్నాడని ఆ హీరో రవితేజ నటించబోతున్నాడన్న దాంట్లో మాత్రం ఇంతవరకు మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. కాగా తాజా సమాచారం ప్రకారం రవితేజ ఈ సినిమాలో నటించడం లేదని సమాచారం. అందుకు కారణం ఎఫ్ 3 లో రవితేజ్ క్యారెక్టర్ లెంగ్త్ చాలా చిన్నది కావడమేనట. మరి ఇది నిజమా కాదా అన్నది మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.