దేశవ్యాప్తంగా ఆడా, మగా అనే తేడా లేకుండా ఎక్కువమంది ఉపయోగించే ఫెయిర్ నెస్ క్రీమ్…. ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ అని అందరికీ తెలిసిందే. అయితే జాతివివక్ష, సౌందర్య ప్రామాణికత పై ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న చర్చ నేపథ్యంలో ఎఫ్ఎంసిజి దిగ్గజం హిందుస్థాన్ యూనిలీవర్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థ ప్రధాన బ్రాండ్ అయిన ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ ఫేస్ క్రీమ్ నుండి ‘ఫెయిర్’ అనే పదాన్ని తొలగించేందుకు నిర్ణయించింది. దీంతో ఈ మేరకు ఈ క్రీమ్ ను రీ-బ్రాండ్ చేయనున్నట్లు ప్రకటించారు.
అంతేకాకుండా ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ ప్యాకెట్ పై ఉండే రెండు మొఖాలతో పాటు మరో నల్లటి ముఖాన్ని తొలగించామని చెప్పారు. రెగ్యులేటరీ ఆమోదం అనంతరం మరి కొద్ది నెలల్లో ఈ క్రీమ్ కొత్త పేరుతో మరియు కొత్త ఇమేజ్ తో వినియోగదారుల ముందుకు రానుంది. అలాగే గత దశాబ్దంలో మహిళల సాధికారత సందేశంతో అనేక ప్రకటనలు తీసుకువచ్చామని పేర్కొన్న వారు ప్రజల నుండి ఇప్పుడు తీసుకున్న నిర్ణయానికి మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు.
భారతదేశంలో విక్రయించే రెండు ఫెయిర్నెస్ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు అమెరికన్ మల్టీనేషనల్ జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించిన వారం తరువాత హెచ్యూఎల్ ఈ నిర్ణయం ప్రకటించడం విశేషం. అయితే విశ్లేషకులు అంచనా వేసినట్టుగానే సౌందర్య ఉత్పత్తులను నిలిపివేయకుండా.. కేవలం పేరు మార్చేందుకు నిర్ణయించడం గమనార్హం.
కాగా కంపెనీకి సంబంధించి ప్రధాన ఉత్పత్తి ఫెయిర్ అండ్ లవ్లీ. వార్షిక అమ్మకాల విలువ 560 మిలియన్ల డాలర్లు. భారతీయ స్కిన్ వైట్నింగ్ మార్కెట్ లో 50-70శాతం ఫెయిర్ అండ్ లవ్లీ సొంతం. ఇప్పుడు మంచి పేరుకి మంచి పేరు.. పబ్లిసిటీ కి పబ్లిసిటీ ‘ఫెయిర్’ సొంతం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?