టాలెంట్ ఒకరి సొత్తు కాదు..అందరికీ ఉంటుంది..దాన్ని ప్రదర్శించే అవకాశం రావాలి.. అలా అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారందరికీ సోషల్ మీడియా వేదికగా మారింది.. నటన, డాన్స్, సంగీతం ఇలా ఒకటేంటి అభిరుచి ఉండాలే కానీ ఎలాంటి రంగంలోనైనా తమ ప్రతిభతో వీడియోలు తయారుచేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇప్పటి తరం ఫ్యాషన్ అయిపోయింది.. ఇంస్టాగ్రామ్ వచ్చినప్పటినుంచి పోస్టింగ్ లో ట్రెండు మారింది.. సొంతంగా అభిమానులను సంపాదించుకున్న అవకాశం ఏర్పడింది.. లైవ్ షో లకు ఇంస్టాగ్రామ్ వేదికగా మారింది..! ఫైత్ బెన్సన్ అనే డ్రమ్మర్ తను డ్రమ్స్ వాయించే వీడియోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది..! ఈ వీడియో పోస్టు లకు కామెంట్స్ ఉరుములతో లైక్ ల వర్షాన్ని కురిపించారు నెటిజన్లు..!
ఫైత్ బెన్సన్ డ్రమ్స్ వాయించే స్టైల్ చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.. ఈ అమ్మాయి డ్రమ్స్ వాయించే స్టైల్ కు విధానానికి, ఆమె అందానికి నెటిజన్లు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ఫైత్ డ్రమ్స్ వాయిస్తూ చేసిన వీడియోకు ఏకంగా ఏడు లక్షల లైకులు వచ్చాయి.. అంతేకాదు నీ డ్రమ్స్ వాయించే విధానానికి ఫ్యాన్స్ అయిపోయాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె ప్రతిభకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.నీ డ్రమ్స్ వాయించే విధానానికి కచ్చితంగా ఓ స్టెప్ వేయాలి అనిపిస్తుంది.
టాలెంట్ ప్రదర్శించేందుకు సోషల్ మీడియా ఓ చక్కటి వేదికగా మారింది . తమ ప్రతిభను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తూ ఎంతోమంది లక్షలాది మంది ఫాలోవర్ లను సంపాదించుకుంటున్నారు. మ్యూజిక్, స్టంట్లు , మిమిక్రీ, వంటలు, ఫీట్స్ పాటలు, డాన్స్ ఇలా ఒక్కటేమిటి తనలోని టాలెంట్ ను వీడియో రూపంలో సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చాటి చెబుతున్నారు.. అయితే ఇంకెందుకు ఆలస్యం మీ ప్రతిభ ను కూడా ఒక వీడియో తీసి పోస్ట్ చేయండి, అనేకమంది ఫాలోవర్స్ ను గెలుచుకోండి.
https://www.instagram.com/p/CJrnLERhWwV/?utm_source=ig_web_copy_link