NewsOrbit
న్యూస్

ఫేక్: సాధువును కొట్టిన ముస్లింలు

గాయాలతో ఉన్న సాధువు
హిందీ పత్రికలలో తప్పుడు వార్త

కాన్పూర్: ఒక హిందూ సాధువును ఇద్దరు ముస్లింలు పట్టుకుని కొట్టినట్లు రెండు హిందీ దినపత్రికలలో ప్రధాన వార్తగా ప్రచురితమైంది. అందులో ఒక సాధువు బాగా గాయాలతో ఉన్న ఫొటోను కూడా ప్రచురించారు. ఇదంతా తప్పుడు కథనం అన్న విషయాన్ని ‘ఆల్ట్ న్యూస్’ గుర్తించింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను పొగిడినందుకు వాళ్లు కొట్టినట్లుగా ఆ కథనాల్లో ఉంది. ‘‘दौलतपुर में योगी की तारीफ करने पर संन्यासी को किया मरणासन्न’’ అనే శీర్షికతో దైనిక్ జాగరణ్ మార్చి 24న ఓ కథనం ప్రచురించింది. దౌలత్ పూర్ గ్రామంలలోని సజేతి పోలీసు స్టేషన్ పరిధిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ను పొగిడినందుకు సాధువును కొట్టినట్లుగా అందులో రాశారు. గురువారం రాత్రి ఒక వర్గానికి చెందిన రౌడీలు తాగి గుడిలోకి ప్రవేశించి, అక్కడ ఆ సాధువును కర్రలతో చావచితగ్గొట్టినట్లు చెప్పారు. సాధువును శుక్రవారం నాడు ఆసుపత్రికి తీసుకెళ్లిన గ్రామస్థుడిని కూడా తర్వాత కొట్టారని, ఈ ఘటనపై గ్రామస్తులు భయపడుతున్నారని రాశారు.

కొట్టారని దైనిక్ కథనం
దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం, మనోజ్ బాబా అనే సాధువు కాళికాదేవి గుడి దగ్గరలో ఉన్న ఓ ఆశ్రమంలో ఉంటారు. హనుమాన్ ఆలయం బయట ఉన్న కొంతమంది భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ కుంభమేళా ఏర్పాట్లపై యోగి ఆదిత్యనాథ్ ను ప్రశంసించారు. అక్కడే మరో వర్గానికి చెందినవాళ్లు కూడా ఉన్నారని ఆ కథనంలో రాశారు. ఆయన తన ఆశ్రమం వైపు వెళ్తుండగా కొందరు వ్యక్తులు ఆలయంలోకి వచ్చి ఆయనపై దాడి చేశారననారు. ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లిన రాంబాబు నిషాద్ అనే వ్యక్తిని కూడా రౌడీలు కొట్టినట్లుగా ఉంది. మనోజ్ బాబా పోలీసులకు ఫిర్యాదుచేసి, వాంగ్మూలం కూడా ఇచ్చారన్నారు. నిందితులు నూర్ బక్ష్, నూర్ అలీల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజస్థాన్ పత్రిక కూడా ఇదే ఘటనను ప్రచురించింది గానీ, తర్వాత కాన్పూర్ నగర్ పోలీసుల ట్వీట్ చూసి కథనాన్ని మార్చింది. లోపల శీర్షిక మార్చినా, యూఆర్ఎల్ మాత్రం ఇంకా.. యోగిని పొగిడినందుకు సాధువుపై గ్రామస్తుల దాడి అనే ఉంది.

పోలీసులు విప్పిన గుట్టు
కాన్పూర్ పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన అసలు విషయాలు బయటపెట్టారు. ‘‘21-03-19 రాత్రి మత్తులో ఉన్న సాధువు తనకు తానుగా ఆలయం గోడకు తల తగలడంతో గాయపడ్డారు. తర్వాతి రోజు ఉదయం చున్నా, సురేష్, రాంబాబు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. తిరిగి వచ్చేటపుడు వాళ్లు గొడవపడగా దానిపై ఎన్.సి.ఆర్. నమోదైంది. మిగిలిన ఆరోపణలన్నీ అవాస్తవం’’ అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

రాంబాబు వండిన కథ
దీనిపై ఆల్ట్ న్యూస్ సజేతి పోలీసు స్టేషను వర్గాలను సంప్రదించగా, అక్కడి అధికారి అమరేంద్ర బహదూర్ సింగ్ ఇలా చెప్పారు. ‘‘సాధువును కొట్టినట్లుగా మీడియాలో వచ్చిన కథనాలు తప్పు. మనోజ్ బాబా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఆరోజు రాత్రి మత్తులో ఉన్న అతడు ఒక కొమ్మ ఎక్కేందుకు ప్రయత్నించి, కింద పడి గాయపడ్డాడు. గ్రామస్తులు తర్వాతి రోజు ఉదయం అతడిని లేపారు. వారిలో రాంబాబు నిషాద్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. తిరిగి వచ్చేటపుడు కొందరు గ్రామస్తులతో గొడవ జరిగింది. వాళ్లు వెళ్తున్న వాహనం అక్కడ ఆడుకుంటునన పిల్లల మీదకు వెళ్లడంతో ఈ గొడవ అయ్యింది. తాగి కారు నడుపుతున్న రాంబాబుపై గ్రామస్తులు ఆగ్రహించారు. రాంబాబును వాళ్లు కొట్టగా, తర్వాత అతడు, మనోజ్ బాబా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దరఖాస్తు మీద రాంబాబు సంతకం చేశాడు. కానీ వైద్య పరీక్షలకు మనోజ్ బాబా నిరాకరించారు. తనపై ఆశ్రమంలో దాడి జరిగిన విషయాన్ని కూడా ఖండించారు. ఇద్దరు ముస్లింలు కొట్టారన్నదంతా రాంబాబు వండిన కథనం. ఈ ఘటనను మతఘర్షణగా మార్చేందుకు అతడు ప్రయత్నించాడు’’ అని చెప్పారు. తర్వాత టీవీ9 భారత్ వర్ష్ చానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సమీర్ అబ్బాస్ ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో ఇవే విషయాలను మనోజ్ బాబా చెప్పడం ఉంది.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Leave a Comment