NewsOrbit
న్యూస్

మేజర్ అంటాడు కోట్లు కొట్టేస్తాడు : పెళ్లి కొడుకు నిత్య మోసాలు

 

 

భారత్ ఆర్మీ లో మేజర్ అని కలర్ ఇస్తాడు. నెలకు మూడు లక్షల జీతం వస్తుంది అని చెబుతాడు. రూపాయి కట్నం అక్కర్లేదు అంటాడు. సంబంధం నచ్చింది.. ముహూర్తాలు పెట్టడం అని కంగారు పెడతాడు. అంత లోనే అత్యంత అవసరమని కొంత మొత్తం డబ్బు సర్దండి టాక్స్ పే చేయాలంటూ హడావుడి చేస్తాడు. లేకపోతే తన ఉద్యోగానికి కూడా ప్రమాదమని వేషాలు వేస్తాడు. చివరకు పెళ్లికూతురు తరపు దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు కాజేసి పరారు అవుతాడు. ఇది ఒక టెన్త్ క్లాస్ చదివి, సులభంగా డబ్బు సంపాదించాలని పన్నాగం పన్నిన ఓ యువకుడి కథ పూర్తిగా చదివేయండి.

 

fake major arrested

17మంది దగ్గర 8.25 కోట్లు

ప్రకాశం జిల్లా పలుగురాళ్ళ తండాకు చెందిన ముదావత్ శ్రీను నాయక్ 10 వ తరగతి చదువుకున్నాడు. ఇంట్లో ఖాళీగా ఉంటున్న శ్రీను భార్య ఏదైనా వైద్య కోర్సులు చేస్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అని సూచించింది. ఆమె కూడా వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తుండడంతో కనీసం ఔట్సోర్సింగ్ పద్ధతిలో అయినా భర్తకు ఉద్యోగం ఇప్పించవచ్చు అని హైదరాబాద్ కు పంపింది. ఉప్పల్లో ఓ గది అద్దెకు తీసుకుని కాలక్షేపం చేసిన శ్రీను విలాసాలకు అలవాటు పడ్డాడు. సులభంగా డబ్బు సంపాదించే దారులు వెతికాడు. సోషల్ మీడియాలో తాను ఆర్మీ మేజర్ నంటూ ఫోటోలు పెట్టి హల్చల్ చేసేవాడు. ఇక్కడినుంచే అసలు కథ మొదలైంది.

ఆలోచింపజేసిన వార్త:

శ్రీను ఒకరోజు హోటల్లో పేపర్ చదువుతూ ఉండగా తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 28 మందిని పెళ్లి చేసుకున్నట్లు, అందరి వద్ద నుంచి కట్నంగా భారీగా డబ్బు రాబట్టుకొని పరారైనట్లు ఓ వార్త చదివాడు. దీంతో శ్రీను కు సరికొత్త ఆలోచన వచ్చింది.
ఆర్మీ మేజర్ గా పరిచయం చేస్కుంటూ ఇదే తీరున కొన్ని మ్యాట్రిమోనీ లకు ఫోటోలు పంపాడు. ఆర్థికంగా బాగా డబ్బున్న వారిని టార్గెట్ గా చేసుకునేవాడు. సంబంధానికి వెళ్లడం అక్కడ నీతులు చెప్పడం, కట్నం అవసరం లేదని, కట్నం తీసుకోవడం చాలా తప్పు అంటూ వాదించేవాడు. శ్రీను ప్రవర్తన ఎవరికీ అనుమానం రాకుండా ఉండేది. పెళ్లి సంబంధం ఓకే అయ్యాక, పెళ్లికూతురు తరుపు బంధువుల తో తనకు అర్జెంట్ అవసరం ఉందని, కొద్ది మొత్తం డబ్బు అత్యవసరంగా సర్దాలి అనీ తొందర పెట్టే వాడు. ఆదాయపు పన్ను టాక్స్ అంటూ హడావుడి చేసే వాడు. అమ్మాయి తరపు బంధువులు ఎంతోకొంత సభ్యులు తర్వాత శ్రీను నాయక్ మాయమైపోయాడు. ఇలా 17 మందిని మోసం చేసాడు.

ఐఐటీ దెబ్బకొట్టింది:

శ్రీను నాయక్ తన మోసాల్లో భాగంగా ఇటీవల ఐఐటి ఖరగ్పూర్లో చదివిన ఓ విద్యార్థిని టార్గెట్ చేసాడు. డిఫెన్స్ అకాడమీ లో డిగ్రీ చదివానని ఐఐటి చెన్నైలో సైతం తాను చదువుకున్నట్లు చెప్పుకొనే వాడు. అతడి మాట తీరు వ్యవహారశైలి పట్ల సదరు యువతికి అనుమానం వచ్చి శ్రీను నాయక్ అసలు విషయాన్ని శోధించింది. పరిశీలనలో శ్రీను నాయక్ అసలు ఐఐటి చెన్నై లోకి రాలేదని తేలింది. దీంతో ఆమె హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. విచారణలో భాగంగా శ్రీను నాయక్ వరంగల్ కు చెందిన ఓ యువతి తండ్రి దగ్గర నుంచి దాదాపు రెండు కోట్ల మేర దండుకున్నట్లు తేలింది. అలాగే ఓ వైద్యురాలు వద్ద 50 లక్షలు సచివాలయ ఉద్యోగుల 52 లక్షలు మేర టోపీ వేసాడు. అయితే పరువు పోతుందనే భయంతో వారు ఎవరు బయటకు రాలేదు. మ్యాట్రిమోనీ లో పెళ్లి సంబంధాలు చూసుకునే అప్పుడు పూర్తి వివరాలు వారి యొక్క బ్యాక్ గ్రౌండ్ ను కనుక్కొని చేసుకుంటేనే మంచిది. అన్నట్లు చివరిగా… శ్రీను నాయక్ తాను ఉన్నత శ్రేణి వ్యక్తిగా చెప్పుకునేందుకు దాదాపు రెండు కోట్లు లో విల్లా కారు ఇతర సౌకర్యాలు సమకూర్చుకున్న ట్లు పోలీసు విచారణలో తేలింది.

author avatar
Special Bureau

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju