Family Man season 2 : తెలుగులో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ -2 రిలీజ్ డేట్ లాక్..?

Share

Family-Man- season 2: తెలుగు వారైనా రాజ్ అండ్ డీకే తెలుగు కంటే బాలీవుడ్ ఇండస్ట్రీలోనే తమ సత్తా చాటుతున్నారు. ఒక్కసారిగా అమెజాన్ ప్రైం కి అసాధారణమైన క్రేజ్ వచ్చిందంటే అది వీరు రూపొందించిన ఫ్యామిలీ మ్యాన్ -1 తోనే. వీరిలో ఉన్న అద్భుతమైన టాలెంట్ ఓవర్ నైట్ స్టార్ మేకర్స్ గా పాపులర్ అయ్యేలా చేసింది. తీవ్రవాదం బ్యాక్ డ్రాప్ లో వచ్చి అద్భుతమైన సక్సెస్ సాధించింది ఈ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్. ఇక ఈ సిరీస్ లో ఆద్యంతం తమ నటనతో ఆకట్టుకున్న మనోజ్ భాజ్ పాయ్, ప్రియమణిలకి విపరీతమైన క్రేజ్ వచ్చింది.

family-man-season 2-release-date-is-locked
family-man-season 2-release-date-is-locked

దాంతో వీరు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 రూపొందించారు. ఇందులో అక్కినేని సమంత ముఖ్య పాత్ర పోషించారు. నిజంగా సమంత కెరీర్ లోనే ఇదొక అద్భుతమైన పాత్ర. మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్ అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక రీసెంట్ గా రిలీజైన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ట్రైలర్ తోనే ఒక సంచలనంగా మారింది. తమిళిలు దీనిపై ఆగ్రహం చెందారు. అంతేకాదు సమంతను విపరీతంగా ట్రోల్ చేశారు. దీని కారణంగానో ఏమో గానీ ఫ్యామిలీ మ్యాన్ 2 ని తెలుగులో విడుదల చేయలేకపోయారు. అంతేకాదు కోలీవుడ్ లో జరిగిన హంగామాకి అక్కడ కూడా విడుదల చేయలేదు.

Family-Man- season 2: ప్రస్తుతం కమింగ్ సూన్ అనే ప్రోమో రన్ అవుతుండగా త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.

కేవలం హిందీలో మాత్రమే వచ్చి భారీ సక్సెస్ సాధించింది. కాగా ఎట్టకేలకి ఫ్యామిలీ మ్యాన్ 2 ను తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. సమంత ఇందులో పోషించిన తీవ్రవాది రాజీ పాత్రను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రజల్ని మెస్మరైజ్ చేసేందుకు ఫ్యామిలీ మ్యాన్ -2  రిలీజ్ కు సిద్దం చేస్తున్నారు. ఈ నెలలోనే ‘ఫ్యామిలీ మ్యాన్ -2’ని రిలజ్ చేయడానికి అమెజాన్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కమింగ్ సూన్ అనే ప్రోమో రన్ అవుతుండగా త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.


Share

Related posts

మంత్రి ఇలాకా… ఎంపీ తడాఖా…! పార్టీలో రేగిన కాక…!!

Srinivas Manem

Corona effect : టీటీడీ కీలక నిర్ణయం

somaraju sharma

సూర్య ‘బందోబస్త్’

Siva Prasad