NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జ‌న‌సేన‌లో ఫ్యామిలీ ప్యాకేజ్‌.. ఆ న‌లుగురు బ్ర‌ద‌ర్స్‌కు టిక్కెట్లు ఫిక్స్‌..!

జ‌న‌సేన‌కు పొత్తులో భాగంగా 25 అసెంబ్లీ సీట్లు వ‌స్తేనే గొప్ప అన్న‌ట్టుగా ఉంది. ప‌వ‌న్ ఎన్ని అడిగినా, జోగ‌య్య లాంటి వాళ్లు ప‌వ‌న్ 50 – 70 సీట్లు తీసుకోవాల‌ని కండీష‌న్లు పెడుతున్నా.. అటు బీజేపీ కూడా పొత్తులోకి దిగితే జ‌న‌సేన‌కు 25 అసెంబ్లీ సీట్లు ఇస్తేనే గొప్ప అన్న‌ట్టుగా ఉంది. మామూలుగా టీడీపీ, వైఎస్సార్‌సీపీల్లో ఫ్యామిలీ ప్యాకేజ్‌లు బాగా న‌డుస్తుంటాయి. అయితే ఇప్పుడు జ‌న‌సేన‌లో కూడా ఫ్యామిలీ ప్యాకేజ్‌ల క‌థ న‌డుస్తోంది. జ‌న‌సేన‌లో ఏకంగా న‌లుగురు బ్ర‌ద‌ర్స్‌కు టిక్కెట్లు ఫిక్స్ అవుతోన్న వాతావ‌ర‌ణ‌మే ఆ పార్టీలో క‌నిపిస్తోంది.

ఈ న‌లుగురు బ్ర‌ద‌ర్స్ ఎవ‌రో కాదు జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న రెండో అన్న నాగ‌బాబు సోద‌రులు ఇద్ద‌రు కాగా మ‌రో ఇద్ద‌రు సోద‌రులు విశాఖ జిల్లాకు చెందిన సుంద‌ర‌పు సోద‌రులు. గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ భీమ‌వ‌రంతో పాటు గాజువాక నుంచి పోటీ చేసి రెండు చోట్లా ఓడ‌గా.. ప‌వ‌న్ అన్న నాగ‌బాబు న‌ర‌సాపురం ఎంపీగా ఓడిపోయారు. ఇప్పుడు వీరిలో ప‌వ‌న్ మ‌ళ్లీ భ‌మ‌వ‌రం నుంచే పోటీ చేస్తుండ‌గా.. నాగ‌బాబు అన‌కాప‌ల్లి నుంచి పార్లమెంటుకు పోటీ ప‌డుతున్నారు.

ఇక జ‌న‌సేన‌లో సీటు రేసులో ఉన్న మ‌రో ఇద్ద‌రు సోద‌రులు విశాఖ జిల్లాకు చెందిన సుంద‌ర‌పు బ్ర‌ద‌ర్స్‌. సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్ గ‌త ఎన్నిక‌ల్లోనే య‌ల‌మంచిలి నుంచి జ‌న‌సేన త‌ర‌పున పోటీ చేసి బ‌లంగా ఓట్లు చీల్చారు. అప్ప‌టి నుంచి ఆయ‌నే అక్క‌డ జ‌న‌సేన పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉంటూ పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు పొత్తులో భాగంగా య‌ల‌మంచిలి సీటు జ‌న‌సేన‌కే కావాల‌ని ప‌వ‌న్ ప‌ట్టుబ‌డుతున్నారు.. అది కూడా విజ‌య్‌కుమార్‌కే అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఇక ఇప్పుడు విజ‌య్ సోద‌రుడు స‌తీష్‌కుమార్ కూడా జ‌న‌సేన సీటు ఆశిస్తున్నారు. తాజాగా ఆయ‌న గాజువాక జ‌న‌సేన ఇన్‌చార్జ్‌గా నియ‌మితులు అయ్యారు. మొన్న డిసెంబ‌ర్‌లోనే స‌తీష్ జ‌న‌సేన‌లో చేర‌డం.. మూడు నెల‌ల‌కే ప‌వ‌న్ ఆయ‌న్ను జ‌న‌సేన‌కు ఎంతో ప‌ట్టున్న గాజువాక ఇన్‌చార్జ్‌గా నియ‌మించ‌డంతో విశాఖ జిల్లా జ‌న‌సేన వ‌ర్గాలు షాక్‌లో ఉన్నాయి. విశాఖ జిల్లాలో జ‌న‌సేన పోటీ చేసేది ఐదారు స్థానాలే.. అందులోనూ సుంద‌ర‌పు సోద‌రుల‌కే రెండు సీట్లు అంటే పార్టీ కోసం ఎప్ప‌టి నుంచో క‌ష్ట‌ప‌డుతోన్న మిగిలిన నేత‌ల ప‌రిస్థితి ఏంట‌న్న ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి.

విశాఖ జిల్లాలో సుంద‌ర‌పు సోద‌రుల‌కు య‌ల‌మంచిలి, గాజువాక సీట్లు, ఇటు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు సీట్లు ఇచ్చేస్తే ఇక మిగిలిన పార్టీ నేత‌ల‌కు మిగిలే సీట్లు ఎన్ని అన్న అసంతృప్త సెగ‌లు కూడా పార్టీలో రేగుతున్నాయి.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N

Sneha: ప్ర‌స‌న్న కంటా ముందే నిర్మాతతో స్నేహ ప్రేమాయ‌ణం..నిశ్చితార్థం త‌ర్వాత పెళ్లెందుకు క్యాన్సిల్ అయింది..?

kavya N

Rakul Preet Singh: ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ర‌కుల్.. ఇంత‌కీ ఆమె స్టార్ట్‌ చేయ‌బోయే రెస్టారెంట్ పేరేంటంటే?

kavya N

YSRCP: కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి బిగ్ షాక్ .. పలువురు కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Delhi Liquor Scam: కవితను కోర్టులో హజరుపర్చిన సీబీఐ .. కస్టడీపై ముగిసిన వాదనలు

sharma somaraju

చిల‌క‌లూరిపేటలో సైకిల్ ప‌రుగులు.. వైసీపీ కావ‌టి ప్ర‌చారం ప‌దిమందికి త‌క్కువ.. ఐదుగురికి ఎక్కువా..?

ఉండిలో ఆర్ – ఆర్ – ఆర్ ముచ్చ‌ట‌.. చివ‌ర‌కు తేలేదేంటి..?

బీజేపీ, జ‌న‌సేన‌తో పొత్తున్నా చంద్ర‌బాబుకు చెమ‌ట‌లు.. అందుకే జ‌గ‌న్ ది గ్రేట్‌..?

AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల .. 78 శాతం ఉత్తీర్ణత.. ఫలితాలు తెలుసుకోవడం ఇలా..

sharma somaraju

Pushpa 2: పుష్ప 2లో ఒక్క జాత‌ర‌ సీన్ కే ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా.. మ‌రో 5 సినిమాలు తీయొచ్చు!

kavya N