ముక్కు అవినాష్.. ఈ పేరు వింటే కేవలం ఒకప్పుడు జబర్దస్త్ మాత్రమే గుర్తుకు వచ్చేది. కానీ.. ఇప్పుడు ముక్కు అవినాష్ అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్లందరికీ పరిచయం ఉన్నపేరు. అవును.. అవినాష్ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాడో… ఆయన దశ తిరిగింది. హౌస్ లో ఆయన పంచిన కామెడీని అందరూ బాగా ఎంజాయ్ చేశారు. అందుకే… అవినాష్ కు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక.. అవినాష్ ఇటీవల తన సొంత ఊరు జగిత్యాలకు వెళ్లారు. అక్కడ అవినాష్ ను చూడటానికి జనాలు ఎగబడ్డారు. అవినాష్ అంటూ అందరూ చీర్స్ చేశారు. మొత్తం మీద బిగ్ బాస్ వెళ్లివచ్చాక అవినాష్ లైఫ్ స్టయిలే మారిపోయింది.
మొత్తానికి తన సొంతూరు జగిత్యాలలో అవినాష్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తన సొంతూరుకు వెళ్లిన వీడియోను అవినాష్ తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఈసందర్భంగా అవినాష్ తన ఫ్రెండ్ అరియానాకు సపోర్ట్ చేయాలంటూ ప్రజలను కోరుతున్నాడు కూడా.