Radhe shyam : రాధేశ్యామ్ అనుకుంటే సలార్ అంటున్నారు..డిసప్పాయింట్ అవుతున్న ఫ్యాన్స్..!

Share

Radhe shyam : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ గా తారా స్థాయిలో క్రేజ్ సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేశాడు. వాటిలో ఆయన నటిస్తున్న రొమాంటిక్ పీరియాడికల్ సినిమా రాధే శ్యామ్ కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు రెండేళ్ల నుండి ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. సాహో సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్న సమయంలో రాధే శ్యామ్ షూటింగ్ మొదలయింది.

fans-are-dissappointed-due-to-salaar-before-radhe-shyam
fans-are-dissappointed-due-to-salaar-before-radhe-shyam

సాహో రిలీజ్ చేసిన ఆరు నెలల్లోనే రాధే శ్యామ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కాని ఆరు నెలలు కాస్తా రెండు సంవత్సరాలు దాటిపోయినా ఈ సినిమా రిలీజ్ పై ఒక క్లారిటీ రావడం లేదు. ఇంకా 10 రోజుల షూటింగ్ పూర్తి అవ్వాల్సి ఉంది. షూటింగ్ సాగుతున్న సమయంలో కరోనా రావడంతో మళ్ళీ ఆగిపోయింది. ఇప్పటికే జులై 30న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దాంతో జూలై ప్రారంభంలోనే పూర్తి చేస్తారని అందరూ భావించారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని అంటున్నారు. రాధే శ్యామ్ కాకుండా సలార్ సినిమా షూటింగ్ మొదలవబోతోందని అంటున్నారు.

Radhe shyam : బాలీవుడ్ స్ట్రైట్ సినిమా ఆదిపురుష్ కూడా షూటింగ్ కి సన్నాహాలు చేస్తున్నారు.

సలార్ మూవీ టీమ్ నుండి అందుతున్న అప్‌డేట్ ని బట్టి జులై 1 నుంచి సలార్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలు కాబోతుందని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే మొదలయ్యాయని సమాచారం. జూన్ చివరి వారానికి ప్రశాంత్ నీల్ తన టీమ్ తో హైదరాబాద్ చేరుకుంటారట. లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారట. సలార్ కంటే రాధే శ్యామ్ డిలే అవుతుందని మాట్లాడుకుంటున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక బాలీవుడ్ స్ట్రైట్ సినిమా ఆదిపురుష్ కూడా షూటింగ్ కి సన్నాహాలు చేస్తున్నారు.


Share

Related posts

మంచు విష్ణు `మోసగాళ్ళు`

Siva Prasad

Sunil : సునీల్ సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోయింది..ఎంత బిజిగా ఉన్నాడో

GRK

Nagarjuna : నాగార్జున బాటలోనే నాగ చైతన్య..??

sekhar