Radhe shyam: అభిమానులే అతిథులు..డార్లింగ్ ఊహించని గిఫ్ట్..ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్..

Share

Radhe shyam: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అభిమానులకు లైఫ్‌లో ఊహించని గిఫ్ట్ ఇస్తున్నారు. ఇన్నాళ్ళు ప్రభాస్‌తో పాటు ఆయన చిత్రబృందాన్ని ఫ్యాన్స్ నెగిటివ్‌గా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. వారు ఆశించినట్టుగా, ఎదురుచూస్తున్నట్టుగా రాధే శ్యామ్ సినిమా నుంచి అప్‌డేట్స్ రావడం లేదని సోషల్ మీడియా వేదికగా ఎంతటి రచ్చ చేశారో తెలిసిందే. ఓ అభిమాని అయితే టీమ్ కి ఏకంగా సూసైడ్ నోట్ కూడా రాశాడు. అవన్నీ ఇప్పుడు పటాపంచలైపోయాయి. అలాంటి సర్‌ప్రైజ్ ఇచ్చాడు ప్రభాస్. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరిగా రాధే శ్యామ్.

బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ టీ సిరీస్ వారితో కలిసి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ కలిసి దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో ప్రభాస్ సరసన మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే నటించింది. వింటేజ్ లవ్ స్టోరీగా రాబోతున్న రాధే శ్యామ్ మీద భారీ అంచనాలున్నాయి. న్యూ ఇయర్‌లో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న 7 భాషలలో భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు.

Radhe shyam: థియేట్రికల్ ట్రైలర్స్‌ను అభిమానులతో విడుదల చేయించబోతున్నాడు..

తాజాగా రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 23న నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్‌లో అన్నీ భాషలకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్స్‌ను అభిమానులతో విడుదల చేయించబోతున్నాడు ప్రభాస్. అంతేకాదు ఈ ఈవెంట్‌కు అభిమానులే అతిథులుగా రాబోతున్నారు. ఇది ప్రభాస్ అభిమానులకు ఇస్తున్న నెవర్ బిఫోర్ గిఫ్ట్. ఇక ఈ సినిమా సంక్రాంతి బరిలో పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ – మాస్ ఎంటర్‌టైనర్ భీమ్లా నాయక్ సినిమాలతో బరిలోకి దిగబోతోంది. చూడాలి మరి ఈ సినిమాల ముందు ప్రభాస్ రాధే శ్యామ్ ఎంతవరకు పోటీ ఇస్తుందో.


Share

Related posts

కేరళలో సంచలనం..! బంగారు భామ అరెస్ట్.. ఇంకా ఎవరెవరో..??

somaraju sharma

మెగా సూపర్ వేడుక

Siva Prasad

అంధాదున్ రీమెక్ లో టబు అనుకున్నారు.. కుర్రాళ్ళు రెడీ అయ్యారు.. కాని అంతకంటే సూపర్ హీరోయిన్ ని తీసుకొస్తున్నారు ..!

GRK