మహేష్ బాబు ఒకప్పుడు ఒక్కడు, అర్జున్, పోకిరి, బిజినెస్ మాన్, దూకుడు లాంటి పక్కా మాస్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. మహేష్ బాబు ని పూరి జగన్నాధ్ చూపించినంత మాస్ హీరోగా ఇండస్ట్రీలో మరే దర్శకుడు చూపించలేదు. అందుకే పోకిరి ఇండస్ట్రీ రికార్డ్ ని ఇంకా చెప్పాలంటే 75 సంవత్సరాల నుంచి ఉన్న రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టింది. ఆ తర్వాత మహేష్ బాబు – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన బిజినెస్ మాన్ కూడా భారీ కమర్షియల్ సక్సస్ ని సాధించింది. ఈ క్రమంలో మళ్ళీ మహేష్ బాబు – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో సినిమా అనుకున్నప్పటికి ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు.
కాగా మహేష్ బాబు ఎప్పుడైతే వెంకటేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేశాడో అప్పటి నుంచి దాదాపు మాస్ సినిమాలకి దూరం అయ్యాడు. వరసగా బ్రహ్మోత్సవం, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి లాంటి క్లాస్ సినిమాలే ఎక్కువగా చేస్తున్నాడు. ఫ్యాన్స్ కి మహేష్ బాబు ని మాస్ హీరోగా చూడాలన్న కోరిక ని సరిలేరు నీకెవ్వరు సినిమాతో దర్శకుడు అనిల్ రావిపూడి కొంతవరకు తీర్చాడు. కాని ఇది చాలదంటున్నారు. అందుకు కారణం తాజాగా వచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్.. అలాగే కన్నడ రాకింగ్ స్టార్ నుంచి రాబోతున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాలు.
ఈ రెండు సినిమాలు భారీ మాస్ ఎంటర్టైనర్స్ గా రూపొందాయి. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్స్ గా ఈ మధ్య రిలీజైన కేజీఎఫ్ 2, మాస్టర్ టీజర్స్ చూసి ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్ కి కూడా అలాంటి కంప్లీట్ హై ఓల్టేజ్ సినిమాలను ఇప్పటి నుంచి మహేష్ బాబు చేయాలని కోరుకుంటున్నారట. కాగా త్వరలో మహేష్ బాబు సర్కారు వారి పాట అన్న సినిమాతో సెట్స్ మీదకి రాబోతున్నాడు. పరశురాం ఈ సినిమాని తెరకెక్కించబోతుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…