Roja: జబర్దస్త్‌లో ఉండకపోతే మా కోసం సినిమాలు చేయొచ్చు కదా మేడమ్ రోజా అంటున్న ఫ్యాన్స్.

Share

Roja: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు రోజా. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ సహా తమిళంలో కూడా సూపర్ హిట్ మూవీస్ చేసి క్రేజీ హీరోయిన్‌గా మారారు. మీనా, రమ్యకృష్ణ, నగ్మా, ఆమని, ఇంద్ర లాంటి వారితో పోటీ పడి తన సత్తా చాటారు. చాలా సినిమాలలో మీనాతో కలిసి రోజా నటించారు. రోజా సినిమాలన్నీ ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా రూపొంది సూపర్ హిట్ సాధించడంతో ఆమెకి ఫ్యామిలీ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ కారణంగా హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ కూడా అందుకున్న హీరోయిన్‌గా అప్పట్లో చెప్పుకున్నారు.

fans are requesting roja-to come back in movies
fans are requesting roja-to come back in movies

రోజా నటించిన కమర్షియల్ సినిమాలు బాగా హిట్ అయ్యాయి. అలాగే బాలయ్య నటించిన భైరవద్వీపం లాంటి పౌరాణిక చిత్రంలో కూడా నటించి మెప్పించింది. మంచి గ్లామర్ హీరోయిన్‌గా నటించిన రోజా, ఎక్కువ సినిమాలు చేసింది అంటే మెగాస్టార్ చిరంజీవితోనే. ఆయనతో నటించిన ముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్ళు, బిగ్ బాస్ లాంటి సినిమాలు మెగా అభిమానులనే కాక కామన్ ఆడియన్స్‌ను బాగా ఎంటర్‌టైన్ చేశాయి. అందుకే రోజాకి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఆమె ఇంకా స్క్రీన్ మీద కనిపిస్తుండటంతో సినిమాలలోకి రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Roja: రోజా అభిమానులు కూడా ఆమె సినిమాలలో నటిస్తే చూడాలనుకుంటున్నారు.

పెళ్ళి తర్వాత తోటి హీరోయిన్స్ మీనా, ఖుష్బూ లాంటి వారు హీరోయిన్‌గా సినిమాలు చేస్తున్నారు. మీనా మలయాళంలో వచ్చి పెద్ద హిట్ అయిన దృశ్యం సినిమా రెండు భాగాలలోనూ నటించి మెప్పించింది. అవే సినిమాలు తెలుగు రీమేక్‌లో కూడా మీనా వెంకటేశ్‌తో జతకట్టింది. ఇక కుష్బూ కూడా ఇప్పుడు అణ్ణాత్త సినిమాలో నటిస్తోంది. అంతకముందు తెలుగులో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాలో నటించారు. రమ్యకృష్ణ గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి తర్వాత శివగామిగా ఎంతటి పాపులారిటీ తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం రమ్యకృష్ణ తన భర్త క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న రంగ మార్తాండ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్, పూరి నిర్మాణంలో రూపొందిన రొమాంటిక్ సహా మరికొన్ని సినిమాలలో అద్భుతమైన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్‌లో సినిమాల పరంగా చాలా బిజీగా ఉన్న నటీమణి అంటే రమ్యకృష్ణ అని చెప్పాలి. నదియా లాంటి వారు కూడా మంచి పాత్రలు చేస్తూ ఫాంలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రోజా అభిమానులు కూడా ఆమె సినిమాలలో నటిస్తే చూడాలనుకుంటున్నారు.

Roja: రోజా హుందాతనమైన పాత్రలు చేయాలని అభిమానులు ఆశపడుతున్నారు.

ప్రస్తుతం రోజా జబర్దస్త్ ప్రోగ్రాంకి జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ షోకి జడ్జ్‌గా ఉన్న రోజా సీట్‌లో కూర్చొని టైమింగ్ చూసి జోకులు వేయడం, కౌంటర్లు వేయడం.. అందరినీ నవ్విస్తుండటం చేస్తున్నారు. ఈ షోలో ఆమె బాగానే ఎంటర్‌టైన్ చేస్తున్నారు. దీనితో పాటు అప్పుడు ఫెస్టివల్ స్పెషల్ ప్రోగ్రాంస్‌లో కూడా సందడి చేస్తున్నారు. కానీ అంతకముందు పూరి దర్శకత్వంలో వచ్చిన గోలీమార్ సినిమాలో పాత్రల మాదిరిగా మంచి హుందాతనమైన పాత్రలు చేయాలని అభిమానులు ఆశపడుతున్నారు. రోజా తలుచుకుంటే ఖచ్చితంగా సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయగలదు. మరి ఆమెకి నిజంగా సినిమాలలో నటించే ఆసక్తి లేదా లేక అవకాశాలు రావడం లేదా అనేది తెలియాల్సి ఉంది.


Share

Related posts

YSRCP ; జగన్ X నిమ్మగడ్డ ట్విస్ట్ – ఇదీ అసలైన పోరు..! నిమ్మగడ్డపై వైసీపీ స్ట్రాంగ్ ఆయుధం..!!

Srinivas Manem

మీరు పట్టభద్రులైయ్యారా..మేనేజ్మెంట్ కోర్సులకు ధరఖాస్తు చేసుకోవడం ఇలా..

bharani jella

హైద‌రాబాద్‌లో వ‌ర‌ద‌లు…. ఏపీ – తెలంగాణ గొడ‌వ‌లు

sridhar