ట్రెండింగ్ న్యూస్

నడిరోడ్డుపై సోనూసూద్ కి ఊహించని షాక్ ఇచ్చిన అభిమానులు..!!

Share

దేశంలో చాలా మంది హీరోలు ఉన్నా గాని కీలక సమయంలో పేదలను ఆదుకుని తనలో మానవత్వాన్ని బయటపెట్టి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. లాక్ డౌన్ సమయంలో వలస కూలీలను స్పెషల్ బస్సులతో మరియు ట్రైన్ లతో గమ్యస్థానాలకు చేర్చి ప్రభుత్వాలకు కూడా మతిపోయేలా చేశాడు.

Sonu Sood stopped from meeting migrant workers in Mumbai? Here's what the  actor has to say | Mumbai News Updatesలాక్ డౌన్ ఎత్తివేసిన గాని ప్రస్తుతం సోనూసూద్ ఇంకా తన సేవలు పేద వాళ్లకు అందేలా ప్రత్యేకమైన టీం తో పాటు స్పెషల్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యనే హైదరాబాద్ నగరంలో అంబులెన్సులను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీంతో చాలామంది సోనూసూద్ కి అభిమానుల అవ్వటమే కాక ఆదర్శంగా తీసుకుంటూ .. ఆయనకి గుళ్ళు కట్టేస్తున్నారు.

 

ఎవరూ చేయని రీతిలో సోనుసూద్ భారీగా సహాయం చేస్తూ ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. ఇలాంటి తరుణంలో తాజాగా నడిరోడ్డుపై అభిమానం ఏంటో చూపించారు ఆయన అభిమానులు. మేటర్ లోకి వెళ్తే ఆయన డ్యూటీ కి వెళ్తున్న సమయంలో కారు ఆపేసి రోడ్డు పక్కనే ప్రజలంతా సన్మానం చేయడం జరిగింది. దీంతో సోనూసూద్ ఎంతగానో ఆనందించారు. ఈ అరుదైన దృశ్యాన్ని.. అక్కడ ఉన్న వాళ్లంతా కెమెరాలతో చిత్రీకరించడంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Share

Related posts

Mekapati Goutham Reddy: నెల్లూరుకు చేరుకున్న మేకపాటి గౌతమ్ రెడ్డి పార్ధివ దేహం..

somaraju sharma

Gruhalakshmi: అనుకున్నంత అయిపోయింది.. పాపం తులసి గమనం ఎటువైపో..? గుండెల్ని మెలిపెట్టే సీన్.. !

Ram

వరుసగా రెండో ఏడాది..! నీటి దాహం తీరినట్టే..!

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar