పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ “వకీల్ సాబ్” సినిమా షూటింగ్ హైదరాబాద్ నగరంలో శరవేగంగా సాగుతోంది. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది మే 15వ తారీఖున రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా వైరస్ రావడంతో లాక్ డౌన్ ఎఫెక్ట్ తో షూటింగ్ వాయిదా పడింది. దాదాపు ఎనిమిది నెలల పాటు సినిమా షూటింగ్ లో పాల్గొనని పవన్ ఇటీవల జాయిన్ అవ్వడం జరిగింది.
ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి టీజర్ విషయంలో సినిమా యూనిట్ పై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఒత్తిడి పెరిగిపోయింది. దసరా రోజు ఏదైనా విడుదల చేస్తారని భావించిన సినిమా యూనిట్ నుండి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో… వచ్చే దీపావళికి ఖచ్చితంగా టీజర్ రిలీజ్ చేయాలని అభిమానులు కోరుతున్నారు. మరోపక్క సినిమా యూనిట్ నుండి ఎటువంటి స్పందన రావటం లేదు.
ఏది ఏమైనా వకీల్ సాబ్ సినిమాకి సంబంధించి ఫోటో గాని టీజర్ గానీ రిలీజ్ చేయాలని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్…క్రిష్ దర్శకత్వంలో చేయబోతున్న పిరియాడికల్ సినిమా స్టార్ట్ చేయనున్నారట. ఇదే టైమ్లో కుదిరితే హరీష్ శంకర్ సినిమా కూడా ప్రారంభించాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు టాక్. ఏది ఏమైనా ముందు “వకీల్ సాబ్” సినిమా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాతే మిగతా వాటిపై ఫోకస్ పెట్టాలని పవన్ ఆలోచిస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్.