Bangarraju: బంగార్రాజులను మాస్ స్టెప్పులతో ఊపేస్తోంది యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. 2019లో అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయంలో నటించిన సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’. ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కి భారీ కమర్షియల్ హిట్ సాధించింది. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించాడు. ఇప్పుడు మరోసారి అక్కినేని నాగార్జున – నాగ్ తనయుడు నాగ చైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు సీక్వెల్‌గా బంగార్రాజు తెరకెక్కుతోంది.

ఈ సీక్వెల్ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగ చైతన్య సరసన ఉప్పెన బ్యూటీ సరసన కృతిశెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అన్నీ అనుకున్నట్టుగా పూర్తైతే వచ్చే నెలలో భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల బంగార్రాజు చిత్రానికి సంబంధించిన వరుస అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తున్నారు నాగార్జున బృందం.
Bangarraju: ఫరియా అబ్దుల్లా నాగార్జున – నాగ చైతన్యలతో కలిసి స్టెప్పులేసి అలరించింది.
ఇప్పటికే ఇందులో నుంచి రెండు పాటలు వచ్చి బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా వాసివాడి తస్సాదియా అనే లిరికల్ వీడియో సాంగ్‌ను వదిలారు. ఈ సాంగ్‌లో జాతిరత్నాలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఫరియా అబ్దుల్లా నాగార్జున – నాగ చైతన్యలతో కలిసి స్టెప్పులేసి అలరించింది. తాజాగా రిలీజైన ఈ సాంగ్ అన్నీ వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సాంగ్‌కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందివ్వగా మోహన భోగరాజు, సాహితి చాగంటి పాడారు. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ సినిమాను జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి.