NewsOrbit
జాతీయం న్యూస్

Farmers Protest: అష్ట దిగ్బంధంలో దేశ రాజధాని ఢిల్లీ .. సింగు సరిహద్దు వద్దకు భారీగా చేరుకున్న రైతులు

Farmers Protest: తమ డిమాండ్ ల సాధన కోసం హస్తిన వేదికగా మరో సారి అన్నదాతలు కదం తొక్కేందుకు సిద్దం కావడంతో ఢిల్లీ చలో ను భగ్నం చేసేందుకు పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హస్తిన సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు.

ఢిల్లీ చలో పిలుపును విమరించుకోవాలని సూచించిన కేంద్రం..రైతు సంఘాల నాయకులతో చండీగఢ్ వేదికగా సోమవారం దాదాపు అర్ధ రాత్రి వరకూ చర్చలు కొనసాగించింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండాల నేతృత్వంలోని ప్రభుత్వ బృందం .. రైతు ప్రతినిధులుగా వచ్చిన ఎస్ కే ఎం నేత జగీత్ సింగ్ డల్లేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వస్ సింగ్ పంధేర్ తదితరులతో చర్చలు జరిపింది.

కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కు భరోసా కల్పించేలా చట్టం చేయడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, పంట రుణాల మాఫీ, రైతులు- రైతు కూలీలకు పింఛన్లు ఇవ్వడం, మూడు వ్యవసాయ చట్టాలకు (తర్వాత రద్దయ్యాయి) వ్యతిరేకంగా 2020-21 లో ఉద్యమించిన సమయంలో రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్ లపై ఈ భేటీలో విస్తృతంగా చర్చ నడిచంది. అయితే వీటిలో 2020-21 నాటి కేసుల ఉపసంహరణకు కేంద్ర బృందం అంగీకరించింది.

నాటి ఆందోళనల సమయంలో మరణించిన అన్నదాతల కుటుంబాల్లో ఇంకా ఎవరైనా పరిహారం దక్కకుండా ఉండి ఉంటే వారికీ పరిహారం అందించేందుకు సమ్మతించింది. ఎంఎన్ పీకి చట్టబ ద్దత కల్పించాల్సిందేనని రైతు నాయకులు ప్రధానంగా డిమాండ్ చేశారు. దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో మంగళవారం నాటి ఢిల్లీ చలో యథాతథంగా కొనసాగుతున్నట్లు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం సర్వస్ సింగ్ పంధేర్ ప్రకటించారు.

దీంతో ఢిల్లీలోకి నిరసనకారులు ప్రవేశించకుండా అడ్డుకునేందుకు సింఘు, గాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. రహదారులపై బహుళ అంచెల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కర్ణాటక నుండి ఢిల్లీకి వస్తున్న దాదాపు వంద మంది రైతులను మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎస్ కే ఎం దక్షిణ భారత కన్వీనర్ శాంత కుమార్ తెలిపారు.

ఢిల్లీలో నిన్నటి నుండి నెల రోజుల పాటు సెక్షన్ 144 విధిస్తూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోడా ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు, భద్రతా దళాలు అప్రమత్తమై నగరాన్ని అష్టదిగ్బంధం చేశాయి. యూపీ, పంజాబ్, హరియాణా తో ఉన్న సరహద్దుల్లో జాతీయ రహదారులను పూర్తి గా మూసివేశారు.

ఛలో డిల్లీ పిలుపుతో సింగ్ బార్డర్ వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. ఈ రైతు ఉద్యమానికి పంజాబ్ కిసాన్ మజ్దూర్ కమిటీ ప్రెసిడెంట్ సుఖ్వీందర్ సింగ్ సభ్రా నాయకత్వం వహిస్తున్నారు.

TDP Janasena First List: టీడీపీ, జనసేన అభ్యర్ధులను ఖరారు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ..ఫస్ట్ లిస్ట్ ఎప్పుడంటే..?

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

బీజేపీ మెయిన్ టార్గెట్ వీళ్లే… లిస్టులో ఉన్నోళ్లు మామూలోళ్లు కాదుగా…!

మంగ‌ళ‌గిరిలో లోకేష్‌పై వైసీపీ గెలుపు వెన‌క ఉన్న ధీమా ఇదే…!

మ‌హేసేన రాజేష్‌కు టీడీపీ టిక్కెట్‌ గొడ‌వ‌లో కొత్త ట్విస్ట్…!

టీడీపీలో వైసీపీ కోవ‌ర్టులు ఎవ‌రు… చంద్ర‌బాబు క‌నిపెట్టేశారా…?

బెజ‌వాడ బొండా ఉమాకు కొత్త క‌ష్టం వ‌చ్చింది… 30 వేల ఓట్ల‌కు చిల్లు…?

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

ఈ లీడ‌ర్ల‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటోన్న జ‌గ‌న్‌… కంటిమీద కునుకు క‌రువే…!

విజ‌య‌వాడలో ఆ సీటు అన్నీ పార్టీల్లోనూ అదే టెన్ష‌న్‌…!

చంద్ర‌బాబును బ్లాక్‌మెయిల్ చేస్తోన్న టాప్ లీడ‌ర్‌.. సీటు ఇస్తావా.. బ‌య‌ట‌కు పోనా…!

బీజేపీతో జ‌న‌సేన – టీడీపీ పొత్తు.. పురందేశ్వ‌రి సీటుపై అదిరిపోయే ట్విస్ట్‌..!

వైసీపీ ట‌చ్‌లోకి జ‌న‌సేన టాప్ లీడ‌ర్‌…!

కృష్ణా జిల్లాలో చిత్తుచిత్త‌వుతోన్న జ‌గ‌న్ ఈక్వేష‌న్లు… అభ్య‌ర్థుల గుండెల్లో రైళ్లు…!

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju