NewsOrbit
న్యూస్

ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌.. పంట‌ల‌కు ఇన్సూరెన్స్ ఇలా చేసుకోవ‌చ్చు.. చివ‌రి తేదీ ఎప్పుడంటే..?

ప్ర‌ధాన‌మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న (పీఎంఎఫ్‌బీవై) కింద 2020 ఖ‌రీఫ్ సీజ‌న్‌కు గాను దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో ఉన్న‌ రైతులు త‌మ పంట‌ల‌కు బీమా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. కేంద్ర ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని రైతులంద‌రికీ అందజేస్తోంది. ఇందులో రైతులు ఉచితంగా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. స్వ‌ల్ప మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతులు తృణ‌ధాన్యాలు, ఆయిల్ సీడ్స్ పంట‌ల‌కు బీమా మొత్తంలో 2 శాతం ప్రీమియం చెల్లించాలి. అదే వాణిజ్య‌, హార్టిక‌ల్చ‌ర్ పంట‌లకు అయితే బీమా మొత్తంలో 5 శాతం ప్రీమియం చెల్లించాలి. మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర ప్ర‌భుత్వం భ‌రిస్తుంది.

fasal bima yojana crop insurance how to get and last date

ఇక ఫ‌స‌ల్ బీమా యోజ‌న కింద రైతులు బీమా తీసుకునేందుకు గాను ద‌ర‌ఖాస్తుల‌కు జూలై 31, 2020ని ఆఖ‌రి తేదీగా నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో రైతులు pmfby.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఈ ప‌థ‌కం కింద ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అలాగే play.google.com/store/apps/details?id=in.farmguide.farmerapp.central అనే ప్లే స్టోర్ యాప్‌లోనూ వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ ప‌థ‌కం కింద రైతులు బీమా తీసుకుంటే త‌మ పంట‌ల‌కు పూర్తి స్థాయిలో ర‌క్ష‌ణ క‌ల్పించుకోవ‌చ్చు. విత్త‌నాలు నాటే ద‌శ నుంచి పంట నూర్పిడి ద‌శ వ‌ర‌కు ఈ బీమా వ‌ర్తిస్తుంది. అలాగే క‌రువు, వ‌ర‌ద‌లు, ఇత‌ర ప్ర‌కృతి విప‌త్తులు, అగ్ని ప్ర‌మాదాలు.. త‌దిత‌ర అవాంఛ‌నీయ సంఘ‌టన‌ల ద్వారా జ‌రిగే న‌ష్టాల‌కు కూడా ఈ ప‌థ‌కం కింద పంట‌ల‌కు రైతులు బీమా పొంద‌వ‌చ్చు.

రైతులు ఈ ప‌థ‌కం కింద ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు త‌మ‌కు స‌మీపంలోని బ్యాంకు లేదా ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ క్రెడిట్ సొసైటీ, కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్‌, గ్రామ స్థాయి అధికారులు, వ్య‌వ‌సాయ‌శాఖ అధికారుల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు. లేదా పైన తెలిపిన వెబ్‌సైట్‌, యాప్‌ల‌ను కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. ప‌లు ఇన్సూరెన్స్ కంపెనీల‌కు చెందిన ప్ర‌తినిధులు కూడా ఈ స‌మాచారం ఇస్తారు.

రైతులు ఫ‌స‌ల్ బీమా యోజ‌న కింద ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు త‌మ ఆధార్ నంబ‌ర్‌, బ్యాంక్ పాస్‌బుక్‌, ల్యాండ్ రికార్డు ప‌త్రాలు లేదా కౌలు అగ్రిమెంట్‌, సెల్ఫ డిక్ల‌రేష‌న్ స‌ర్టిఫికెట్ అవ‌స‌రం అవుతాయి. ఇక రైతుల‌కు త‌మ ద‌ర‌ఖాస్తు, ఇత‌ర వివ‌రాల‌కు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు ఎస్ఎంఎస్ రూపంలో వారి రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్ల‌కు ముఖ్య‌మైన స‌మాచారాన్ని పంపిస్తారు.

author avatar
Srikanth A

Related posts

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!