NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Father and Son: కోడింగ్ నేర్చుకున్న కుర్రాడు టెక్నాలజీ తో తండ్రి కష్టం తీర్చాడు..! వ్యవసాయంలో ఇదొక విప్లవం

Father and Son

Father and Son: మహారాష్ట్రలోని నందుర్బార్ కు చెందిన యోగ్ పంజరాలే తన తండ్రి అర్ధరాత్రి పూట నిద్ర లేకుండా వెళ్లి పంట పొలం దగ్గర సమయం గడపడం చూసి తట్టుకోలేకపోయాడు. వారి ప్రాంతంలో విద్యుత్తు కేవలం రాత్రి పూట మాత్రమే నిరంతరాయంగా అందుబాటులో ఉంటుంది. ఇక వ్యవసాయం అనేది 24×7 ఉండే పని. పంటలకు నీరు ఎల్లప్పుడూ కావాలి కాబట్టి అతని తండ్రి వారానికి మూడు రోజులు రాత్రంతా మేల్కొని ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన పొలానికి వెళ్లి మోటర్ స్విచ్ ఆన్ చేసి ఇస్తాడు. 

 

Father and Son: కోడింగ్ నేర్చుకున్న కుర్రాడు టెక్నాలజీ తో తండ్రి కష్టం తీర్చాడు..! వ్యవసాయంలో ఇదొక విప్లవం

కరోనా చేసిన మంచి…

అయితే కరోనా లాక్ డౌన్ సమయంలో తన తండ్రి అయిన సూర్యకాంత్ కష్టానికి స్వస్తి పలికే అవకాశం కొడుకు కు వచ్చింది. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉండే ఖాళీ సమయంలో కోడింగ్ క్లాసులు నేర్చుకొని కోర్సు పూర్తి చేశాడు యోగ్. తన తెలివితేటలతో ఒక మొబైల్ అప్లికేషన్ తో పాటు సరికొత్త పరికరాన్ని కూడా నిర్మించాడు. దాని ద్వారా తన తండ్రి ఇంటిలో నుంచి బయటికి వెళ్లకుండా ఎక్కడో 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోటార్ స్విచ్ ఆటోమేటిక్ గా చేసే టెక్నాలజీ రూపొందించాడు. 

రిస్క్ లేని యాప్

ఇంకేముంది… మొబైల్ అప్లికేషన్ లోని సెల్ నెట్ వర్క్ ద్వారా తన చేతిలో ఉండే ఫోన్ నుండే పొలానికి నీళ్లు అందించడం… ఆపివేయడం సూర్యకాంత్ కు సులువుగా చేశాడు. తన తండ్రి మోటార్ స్విచ్ వేసి వచ్చేందుకే గంట సమయం పడుతుంది. ఈ లోపల ఇంట్లో వారు అతనికి పాముల నుండి ఇతర జంతువులనుండి ఎక్కడ హాని జరుగుతుందో అని భయపడుతూ ఉండేవారు. 

Father and Son: ప్రతిదీ లాభదాయకమే… 

అంతే కాకుండా ఒక్కోసారి స్విచ్ ఆన్ చేసి వచ్చిన తండ్రి మళ్ళీ ఆపేందుకు వెళ్ళలేకపోయేవాడు. దాంతో ఎన్నో లీటర్ల వందల లీటర్ల మంచి నీరు వృధాగా పోతుంది. ఇప్పుడైతే ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా మోటర్ ఇష్టం వచ్చినప్పుడు వేయవచ్చు… ఆపివేయవచ్చు. అలాగే టైమింగ్ కూడా షెడ్యూల్ చేయవచ్చు. మోటార్ రూమ్ లోని లైట్స్ కూడా కంట్రోల్ చేయవచ్చు. 

ఈ అధునాతన ఎలక్ట్రానిక్ పరికరం నిర్మించేందుకు యోగ్ కేవలం నాలుగు వేల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాడు. దాని తర్వాత ఒక అప్లికేషన్ కోడింగ్ చేసి దాని ద్వారా వ్యవసాయం చేసే తన తండ్రికి ఆపద్బాంధవుడు అయ్యాడు. 

author avatar
arun kanna

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!