బెంగళూరు: ఓ తండ్రి కన్నకొడుకుని స్వహస్తాలతో ఉరి తీశాడు. అతని కూతురు దానిని సెల్ఫోన్లో వీడియో తీసింది. వింటేనే భయం కలిగించే ఈ సంఘటన బెంగళూరులో జరిగింది. పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అతను తన భార్యను కూడా ఇలానే చంపాడు.
రుణభారం కారణంగా మొత్తం కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామని అతను పోలీసులకు చెప్పాడు. చూస్తే వళ్లు జలదరించే ఆ వీడియోలో తండ్రి ఒక చిన్న బల్ల ఎక్కి 12 ఏళ్ల తన కుమారుడికి మెడకు బెడ్షీట్ తగిలిస్తూఉండడం కనబడుతుంది. కుమారుడు తండ్రిని నిరోధించడం ఏమీ ఉండదు. పక్కన నేలపై అతని భార్య మృతదేహం కనబడుతుంది.
భయంతో కాబోలు పెద్దగా అరుస్తూ 17 ఏళ్ల కుమార్తె ఈ భయానక సంఘటనను వీడియో తీసింది. ఆదివారం తెల్లవారుఝామున మూడు గంటల ప్రాంతంలో ఇది జరిగింది. ఉదయమే అతని కుమార్తె పొరుగువారికి విషయం చెప్పడంతో వారు పోలీసులకు తెలిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?