Social media: ఒక్కొక్కసారి చాలా బోర్ గా అనిపించి ఏదో కొత్త విషయం తెలుసుకోవాలి అనిపిస్తుంటుంది. అలాంటప్పు ఉత్సాహం కలిగించడానికి వెబ్సైట్లు కొన్ని ఉన్నాయి. వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉండక పోయిన, మిమ్మల్ని బోర్ నుంచీ కాస్త ఆనందం, ఆశ్చర్యం లోకి తీసుకువెళ్తాయి. ఒక్కసారైనా అలాంటి వెబ్ సైట్లోకి వెళ్లి రావాలని అనిపించేలా డిజైన్ చేయబడినవి. అలాంటి కొన్ని వెబ్సైట్ల గురించి తెలుసుకుందాం. మనందరికీ బ్యాగ్ లో ఇతరులకు ఆశ్చర్యాన్ని కలిగించే ఏదో ఒక వస్తువులు ఉంటుంటాయి. అలా ఎవరి బ్యాగులో ఏముందో ఫొటో తీసి ఈ వెబ్సైట్ లో పెడుతుంటారు. ఇలాంటి ఫోటోలను మనం ఒక వెబ్ సైట్ లో చూడొచ్చు. అదే ఈ లింక్ ఇంకా ఎందుకు ఆలస్యం ఒకసారి వెళ్లి చూడండి. https://www.getrevue.co/
ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ వారి సైట్ బర్త్ డే వర్డ్ . మీరు పుట్టిన సంవత్సరం ఈ డిక్షనరీ లో ఏయే ఇంగ్లీష్ పదాలు కొత్తగా చేర్చారు అనేది ఇందులో తెలుసుకోవచ్చు. స్టార్ట్ బటన్ నొక్కి,సంవత్సరం ఇచ్చి,గో క్లిక్ చేయగానే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది పిల్లలకు బాగా నచ్చుతుంది. దాని లింక్ ఇదే ఒకసారి మీ పిల్లలతో కలిసి చెక్ చేయండి. https://public.oed.com/oed-
అంతరిక్షంలోకి వెళ్లి… వ్యోమగాములు ఎలా స్పేస్లో తిరుగుతారో… అలా మనం కూడా తిరిగే ఫీల్ కలుగుతుంది ఈ సైట్ లో కి వెళ్తే . ఆస్ట్రోనాట్ ఇదో ఆసక్తికరమైన సైట్. విద్యార్థుల కు మాత్రమే కాదు పెద్దవాళ్ల కు కూడా తెగ నచ్చేసింది. దానికి కారణం భూమికి 100 మైళ్ళ ఎత్తులో శూన్యంలో ఎగిరినట్లు అనిపిస్తుంది. అలా మీరు అంతరిక్షంలో విహరిస్తుంటే వివిధ దేశాల యూట్యూబ్ వీడియోలు మీకు ఆటోమేటిక్గా ప్లే అవుతూ మీ ముందుకి వస్తుంటాయి. కావాలంటే ఈ లింక్ క్లిక్ చేసి చూడండి. http://astronaut.io
మ్యాడ్ అనే మేగజైన్పై వచ్చిన అనేక కవర్ పేజీలను ఈ వెబ్సైటులో చూసే అవకాశం ఉంటుంది. 1955 నుంచి ఇప్పటి వరకు విడుదలైన అన్ని మ్యాడ్ మ్యాగజైన్ కవర్ పేజీలు ఇక్కడ చూడవచ్చు. దాని కోసం ఈ లింక్. https://www.madcoversite.com/