Dance Plus : డ్యాన్స్ ప్లస్ Dance Plus షో గురించి తెలుసు కదా. ఇటీవలే ఈ షో ప్రారంభం అయినా.. ఈ షోలో ఎక్కువగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈటీవీలో వచ్చే ఢీ షోకు పోటీగా వచ్చినా.. ఢీలో ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేవు. కానీ.. ఈ షోలో మాత్రం జడ్జిల మధ్యనే చాలా వివాదాలు వస్తున్నాయి. దీంతో ఈ షో తెలుగు ప్రేక్షకులకు ఆసక్తి గా మారింది. ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 అయిందంటే చాలు.. డ్యాన్స్ ప్లస్ షోనే చూస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు.

ఈ షోకు యాంకర్ గా ఓంకార్ వ్యవహరిస్తుండగా… డ్యాన్స్ ప్లస్ షోలో జడ్జిలుగా యష్ మాస్టర్, బాబా భాస్కర్, రఘు మాస్టర్, మోనల్ గజ్జర్, ముమైత్ ఖాన్, అనీ మాస్టర్ వ్యవహరిస్తున్నారు.
అయితే.. ఈ షోలో ఎక్కువగా వివాదాలు చేయడంలో ముమైత్ ఖాన్ దిట్ట అయిపోయారు. ప్రతి విషయాన్ని గొడవ చేయడం.. వివాదం చేయడం.. స్టేజ్ మీద నవ్వడం లాంటివి చేయడం.. వేరే వాళ్లను తిట్టడం లాంటివి చేస్తోంది. అయినా కూడా ముమైత్ ను ఎందుకు ఇంకా ఈ షోకు జడ్జిగా ఉంచారో తెలియనప్పటికీ.. తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ లోనూ ముమైత్ అలాగే చేసింది.
Dance Plus : రామ్ లక్ష్మణ్ విషయంలో మరోసారి తన వాయిస్ పెంచిన ముమైత్
తాజాగా.. ఎలిమినేషన్ రౌండ్ లో రామ్ లక్ష్మణ్ ను ముందు యష్ మాస్టర్ నామినేట్ చేశాడు. దీంతో.. నాకు తెలుసు.. అందరూ రామ్ లక్ష్మణ్ నే నామినేట్ చేస్తారు.. అంటూ యష్ మాస్టర్ తో గొడవ పెట్టేసుకునేంత పని చేసింది ముమైత్. తర్వాత రఘు మాస్టర్, అనీ మాస్టర్ కూడా రామ్ లక్ష్మణ్ నే నామినేట్ చేశారు. దీంతో స్టేజ్ మీదే నవ్వేసింది. నాకు తెలుసు.. అందరు రామ్ లక్ష్మణ్ ను నామినేట్ చేస్తారు అనే సరికి.. బాబా భాస్కర్.. ముమైత్ కు ట్విస్ట్ ఇస్తూ.. వేరే టీమ్ ను నామినేట్ చేశారు.
మొత్తానికి ఈ వారం ఎపిసోడ్ మాంచి రసవత్తరంగా మారనుంది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మీరు కూడా ఓ లుక్కేసుకోండి.