Bigg Boss 5 Telugu: ఆఖరి వారంలో హమిదా విషయంలో ఎమోషనల్ అయిన శ్రీరామ్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) షో ఫైనల్ దశకు చేరుకుంది. వచ్చే ఆదివారం ఎవరు విన్ అవుతారు అనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పటిదాకా టైటిల్ మగవాల్లే టైటిల్ గెలవడం జరిగింది. ఇదిలా ఉంటే హౌస్ లో టాప్ ఫైవ్ లో ఒక అమ్మాయి మినహా మిగతా నలుగురు అబ్బాయిలే. బయట వాతావరణం జరుగుతున్న ఓటింగ్ బట్టి చూస్తే మళ్ళీ అబ్బాయే టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బయట పరిస్థితి ఇలా ఉంటే హౌస్ లో…హౌస్ మేట్స్ అందరూ… తమ ప్రయాణాన్ని వీడియో రూపంలో చూసిన తర్వాత.. ఫోటోలను చూసి ఇష్టమైన రెండు ఫోటోలు తీసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే బుధవారం ఎపిసోడ్ లో ఐదుగురు సభ్యుల ఫోటోలను.. హౌస్ లో అమర్చి.. వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకుని బిగ్ బాస్ కి ఒక మంచి సందేశం ఇవ్వాలని తెలిపారు.

Bigg Boss Telugu 5: Actress Hamida to get evicted from the show? - Times of  India

దీనిలో భాగంగా శ్రీరామ్(Sri Ram)… హమీదా(Hamida) ఫోటో సెలెక్ట్ చేసుకుని.. ఆమెను చాలా మిస్ అయ్యాను అంటూ ఎమోషనల్ కామెంట్ చేశాడు. ఇంకా హామీదా గురించి మాట్లాడుతూ.. ఆమె ఎలిమినేట్ అయిన సమయంలో చాలా బాధ వేసింది. స్టార్టింగ్ లో అమ్మాయి తో మంచి బాండు ఏర్పడింది. దాంతో హౌస్ నుండి అందరూ వెళ్లి పోయినా గాని ఆమె వెళ్లిపోతున్న సమయంలో మాత్రం చాలా గుండె బరువుగా అనిపించింది. ఉండి ఉంటే.. నాకు “లో రేంజర్” అనే బిరుదు వచ్చేదేమో కాదు. మిస్ యూ హమీద మళ్ళీ కలుద్దాం.. అంటూ శ్రీరామ్ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు.

Bigg Boss 5 Telugu: Friendship brewing between two Bigg Boss contestants

ఎప్పుడూ ఇటువంటి విషయం హౌస్ లో చెప్పలేదని కూడా పేర్కొన్నాడు. బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో ప్రారంభంలో… వీళ్లిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ నడిచింది. దీంతో ఎపిసోడ్ మొత్తానికి హైలెట్ వీళ్లిద్దరు అవుతారని ప్రారంభంలో వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా తొలి వారాలలోనే హామీద(Hamidaa) ఎలిమినేట్ కావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది శ్రీరామ్ .. అప్పటినుండీ ఒంటరిగానే ఉంటోంది తన సింగిల్ గేమ్ ఆడుతూ.. ఏ గ్రూప్లో జాయిన్ అవ్వకుండా.. తనదైన శైలిలో రాణించాడు. ప్రస్తుతం టాప్ ఫైవ్ లో నిలిచి టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు.. ఎక్కువ ఉన్న కంటెస్టెంట్ గా బయట ఆడియన్స్ చేత శభాష్ అనిపించుకుంటూన్నాడు. ఈ క్రమంలో.. బుధవారం ఎపిసోడ్ లో హమీద పై శ్రీరామ్(Sri Ram) చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Share

Related posts

Chapathi : నిల్వ చేసిన చపాతీ తింటే ఏమవుతుందో తెలుసా?? తెలిస్తే షాక్ అవుతారు.

Kumar

పాకిస్తాన్ను మింగేస్తున్న డ్రాగన్

Vissu

నిశ్చితార్థం చేసుకున్న సింగర్ సునీత..!!

sekhar