Financial Scheme : ఖచ్చితంగా ఇది దంపతులకు శుభవార్తనే చెప్పాలి. అవును. పెళ్ళైన వారికోసం ఒక అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. ఇందులో చేరి ప్రతి నెలా పెన్షన్ ద్వారా మీ కలలను సాకారం చేసుకోవచ్చు. అంతే కాకుండా మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తం లభిస్తుంది. విషయంలోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనే పథకాన్ని అందిస్తోంది. ఇందులో డబ్బులు పెట్టడం వల్ల పలు రకాల ఉపయోగాలు వున్నాయి. అంతేకాకుండా రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
Financial Scheme : నియమనిబంధనలు ఇవే..
ముందుగా ఈ స్కీములో చేరిన వారు 60 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని గమనించాలి. 60 సంవత్సరాల తర్వాత ప్రతి నెలా పెన్షన్ క్రమం తప్పకుండా మీ అకౌంట్లో వచ్చి చేరుతుంది. 18 ఏళ్లు నిండిన వారు వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. గరిష్టంగా 75 ఏళ్ల వరకు ఎన్పీఎస్ అకౌంట్‌ను కొనసాగించొచ్చు. అలాగే మీరు మీ భార్య పేరుపై కూడా NPS ఖాతాను తెరవొచ్చు. ఆన్లైన్లో కూడా ఈ స్కీమ్‌లో చేరే వెసులుబాటు కలదు.
స్కీమ్ వివరాలు ఇవే..
బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కమ్ రిటైర్మెంట్ స్కీమ్స్‌లో ఇది ప్రధానమైనదని చెప్పుకోవాలి. మీ భాగస్వామికి ఆర్థిక భద్రత కల్పించాలని భావిస్తే.. ఈ స్కీమ్‌లో తప్పకుండా చేరండి. 30 ఏళ్లు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని మీరు అనుకుంటే, నెలకు రూ.5 వేలు డిపాజిట్ చేసినట్లయితే 10 శాతం రాబడిని సుమారుగా వేసుకుంటే.. మెచ్యూరిటీ సమయంలో రూ.1.1 కోట్లు వస్తాయి. అలాగే ఇందులో రూ. 45 లక్షలను యాన్యుటీ ప్లాన్‌లో పెట్టుకుంటే అపుడు ప్రతి నెలా రూ.22 వేలకు పైగా పెన్షన్ వస్తుంది. అలాగే మిగిలిన రూ. 68 లక్షలు పూర్తిగా మీకు సొంతం.