Children: ఈ లక్షణాలను బట్టి  పిల్లలకు నిద్ర సరిపోతుందో లేదో తెలుసుకుని.. తగిన జాగ్రత్తలు తీసుకోండి

Share

Children: పిల్లలు ఆరోగ్యవంతంగా    ఎదగడానికి  అవసరమైన వాటిలో    నిద్ర  చాలా ముఖ్యమైనది. 3 -5 సంవత్సరాల   పిల్లలకు రోజుకి 10 – 13 గంటల  నిద్ర అవసరం ఉంటుంది. అదే 6 నుంచి 12 ఏళ్ల పిల్లలకు  9- 11 గంటల పాటు నిద్రించడం చాలా అవసరం.  18 సంవత్సరాలు, అంత కంటే ఎక్కువ వయసు  ఉన్నవారు  7- 9 గంటల  పాటు నిద్రించాలి. పిల్లలకు నిద్ర  సరిపోలేదు అని వారు చెప్పలేరు.  కాబట్టి తెలుసుకోవడం కష్టం.   కానీ  పిల్లలకు నిద్ర తక్కువైనప్పుడు కొన్ని  విషయాలు  గుర్తించవచ్చు. పిల్లల ప్రవర్తనలో తేడా ఉన్నప్పుడు,  ఉండవలసిన దానికన్నా  ఎక్కువ యాక్టివ్ గా ఉన్నప్పుడు, చదువు మీద  శ్రద్ధ చూడలేకపోతున్న   శారీరక ఎదుగుదల తక్కువగా ఉంటుంది .

పిల్లలు త్వరగా నిద్ర లోకి వెళ్లేందుకు  ఇష్టపడరు. మధ్యమధ్యలో లేవడం ,  తెల్లవారుజామున లేచేయడం వంటి  కొన్ని విషయాలు కూడా వారికీ నిద్ర సరిపోక పోవడానికి కారణం  కావొచ్చు. అస్తమానము  ఇల్లు మారడం, ఇంట్లో గొడవలు  పడుతుండడం, స్కూళ్లకు వెళ్లే  మొదటి లో పడే ఇబ్బంది.. వంటి కారణాల వల్ల పిల్లలు కూడా పిల్లలు సరిగా నిద్ర పోలేరు.  పెద్దలు ఎక్కువ సమయం నిద్ర మేల్కొని ఉంటే.. ఆ ప్రభావం కూడా  పిల్లలపై ఉంటుంది.పిల్లలు, పెద్దలు   ఒకే సమయానికి  నిద్ర పోతే చాలా మంచిది. దీనివల్ల నిద్రపోయే  సమయం పెరుగుతుంది.  అలాగే అందరూ   ఒకే సమయంలో నిద్ర లేవడం   మంచి పద్ధతి అనే చెప్పాలి. అలాగే ప్రతిరోజు నిద్రపోయే ముందు 30 – 60 నిమిషాలు కొన్ని పనులు  చేయాలి. పిల్లలకు గోరువెచ్చని నీటితో స్నానం చేయించడం,   పుస్తకాలు చదివించడం వంటివి చేయాలి.

నిద్రపోయే ముందు వీడియో గేమ్స్  ఆడడం,టీవీ చూడడం, సోషల్ మీడియా వాడకం,   వంటి వాటి జోలికి వేళ్ళ కూడదు. పిల్లలకు  అసలు ఇలాంటి అలవాటు చేయకూడదు. నిద్రపోయే ముందు  ప్రశాంతం గా  నిశ్శబ్ద వాతావరణం ఉంటే మంచి నిద్రకు అవకాశం ఎక్కువ.   పిల్లలు నిద్రపోయేటప్పుడు రూమ్ మరి చల్లగాలేదా వేడి గా కాకుండా నిద్రకు అనువుగా ఉండాలి.  పిల్లలను పూర్తి చీకటిలో పాడుకోబెట్టకుండా బెడ్ బల్బ్ ఉంచాలి.


Share

Related posts

జూమ్ మీటింగులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు..!!

sekhar

పశ్చిమగోదావరి జిల్లాలో మరో వింత వ్యాధి..!!

sekhar

Motkupalli Narasimhulu: అబ్బెబ్బే అదేం లేదు! బీజేపీ బలోపేతానికే కెసిఆర్ మీటింగ్ కు వెళ్లానన్న మోత్కుపల్లి! నరసింహలుని నమ్మొచ్చంటారా ??

somaraju sharma