Paneer: మనం ఎక్కువగా వాడే పాల పదార్థాల్లో పన్నీర్ ఒకటి. విరిగిపోయిన పాలతో తయారు చేసే ఈ పనీర్ కూరలలో, బిర్యాని ,స్వీట్స్ లో ఎక్కువగా వాడుతున్నారు. ఈమధ్య కాలంలో పనీర్ క్యూబ్స్ గా కట్ చేసి రెడీమేడ్ గా అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఇలా లభించే పన్నీర్ అంత స్వచ్ఛమైనది అని చెప్పలేము.ఇందులో కొన్ని సార్లు నకిలీ పనీర్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Paneer: పనీర్ లో మంచిది ఏదో
అలా పనీర్ లో మంచిది ఏదో, నకిలీ ఏదో తెలియాలి అంటే ఈ విషయాలు తెలుసుకోండి. పాలతో తయారు అయిన పనీర్ అయితే మృదువుగా ఉంటుంది. అదే నకిలీ పనీర్ అయితే గట్టిగా ఉంటుంది. నిజమైన పనీర్ తిన్న అంత తేలికగా గా నకిలీ పనీర్ తినలేము. దీనితో పాటు నకిలీ పనీర్ కట్ చేసినప్పుడు రబ్బర్ లాగా సాగుతుంటుంది. పనీర్ ని తీసుకుని నీటిలో వేసి బాగా మరిగించండి. తర్వాత కొంచెం సేపు చల్లారనివ్వండి. అలా చల్లారిన పనీర్ మీద రెండు మూడు చుక్కల అయోడిన్ టించర్ వేసి చూడండి . పనీర్ రంగు తెలుపు నుండి నీలం రంగులో వస్తే అది నకిలీ పనీర్ అని తేలిపోతుంది. ఆ పనీర్ లో ఆర్టిఫిషియల్ కెమికల్ కలపబడి ఉంది అని అర్థం చేసుకోవాలి.
దీనితో పాటు పనీర్ ని గట్టిగా రబ్ చేయండి. అలా చేసినప్పుడు అది ముక్కలు ముక్కలుగా విరిగి పోతే కనుక నకిలీ పనీర్ అని అర్థం. అలా జరగకపోతే మాత్రం అది అసలైన పనీర్ అని అర్థం. మామూలుగా చూస్తే గనుక అసలు కి నకిలీ కి అంత పెద్ద తేడా ఏమీ కనిపించదు. కాబట్టి ఈ విధంగా టెస్ట్ చేసి మంచి పనీర్ ని వాడుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.