Printed Covers: ఈ మధ్య కాలం లో షాపింగ్ మాల్స్ వారు తమ లోగో ని కవర్స్ మీద ప్రింట్ చేసి వాటికి కూడా చార్జి చేస్తున్నారని కొందరు వినియోగదారుల ఫోరం వద్దకు వెళ్ళి కంప్లయింట్ చేస్తున్నారు. ఇటీవల అటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఏ లోగో లేకుండా కవర్స్ కి చార్జి చేయవచ్చు కానీ షాపింగ్ మాల్స్ లోగో ని కవర్ల పై ప్రింట్ చేసి అందుకు డబ్బులు వసూలు చేయడం చట్ట రీత్యా నేరం.
తాజాగా హైదరాబాద్ లోని సెంట్రల్ షాపింగ్ మాల్ ఇలా డబ్బులు వసూలు చేస్తున్నందుకు వారికి వినియోగదారుల ఫోరం గట్టి షాక్ ఇచ్చింది. సెంట్రల్ మాల్ కు ఏకంగా రూ. 10 వేలు జరిమానా విధించింది.
వీ బెజ్జం అనే వ్యక్తి తన దగ్గర లోని సెంట్రల్ మాల్ లో రూ. 1400 తో ఓ షర్ట్ కొన్నాడు. ఆ తరువాత ఆ షర్ట్ ని ఓ క్యారీ బ్యాగ్ లో పెట్టి ఇచ్చిన షాపింగ్ మాల్ నిర్వాహకులు క్యారీ బ్యాగు కు గాను అదనంగా రూ. 10 బిల్ వేశారు. ఇది గమనించిన బెజ్జం ఆ షాపింగ్ మాల్ సిబ్బందితో వాగ్వాదనికి దిగగా నిర్వాహకులు కూడా వచ్చారు. వారు కూడా నిర్లక్ష్యంతో సమాధానం ఇవ్వడంతో ఆగ్రహం చెందారు.
దీంతో వారు అతనికి ఇచ్చిన బిల్ మరియు ఆ కవర్ ని కూడా జతచేర్చి వినియోగదారుల ఫోరం ను ఆశ్రయించాడు. ఈ విషయాన్ని విచారించిన న్యాయస్థానం సెంట్రల్ మాల్ యాజమాన్యం ను బెజ్జం కి పరిహారంగా రూ.15వేలు ఇవ్వాలిసిందిగా ఆజ్ఞాపించింది. ఇటువంటి ఘటనలు గతంలో కూడా పలు చోట్ల చోటుచేసుకున్నాయి.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.