ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TDP: ఏపిలో మరో టీడీపీ మాజీ మంత్రిపై కేసు నమోదు.. మేటర్ ఏమిటంటే..?

Share

TDP: ఏపిలో మరో టీడీపీ మాజీ మంత్రి పై కేసు నమోదు అయ్యింది. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దీంతో గుంటూరు జిల్లాలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. వివరాల్లోకి వెళితే..చిలకలూరిపేటలోని మంచినీటి చెరువు వద్ద ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించేందుకు పుల్లారావు నిన్న వెళ్లారు. అయితే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి అనుమతి లేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ప్రారంభోత్సవానికి వెళ్లకుండా పుల్లారావును పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో టీడీపీ నేతలు, పోలీసులకు మధ్య వాద్వివాదం జరిగింది.

ఈ ఘర్షణ పురస్కరించుకుని టౌన్ ప్లానింగ్ సూపర్ ను కులంపేరుతో దూషించారంటూ పోలీసులకు పిర్యాదు అందింది. దీంతో పత్తిపాటి పుల్లారావు, టీడీపీ నాయకులు మదన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, శ్రీనివాసరావులపై ఐపిసి 323, 324, 353, 506, 509 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో చిలకలూరిపేటలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇటీవలే టీడీపీ మాజీ మంత్రి నారాయణపై పదవ తరగతి పరీక్షా పత్రాల లీకేజీ కేసు నమోదు చేయడంతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, నారాయణలతో పాటు మరి కొందరిపై ఏపి సిఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.


Share

Related posts

Angry: మీ కోపాన్ని కంట్రోల్ చేయడానికి ఇవి చాలు..!!

bharani jella

బీజేఎల్పీ సమావేశంలో వాడివేడి చర్చ

Siva Prasad

Spaceship: అంతరిక్షంలోకి వెళ్లేటప్పుడు ఎలాంటి వారైనా డైపర్ వేసుకోవాల్సిందే లేదంటే కొంప మునుగుతుంది …!

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar