Fire Accident: హైదరాబాద్ శివారు జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం కారణంగా ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలైయ్యారు. జీడిమెట్లలోని ఆరోరా ఫార్మాస్యూటికల్స్ కంపెంనీలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్మికులు భయాందోళనకు గురైయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో కార్మికులు రవీందర్ రెడ్డి (25), కుమార్ (24) మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు.