ఓ ఎయిర్ ఫిల్టర్ కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పూణెలోని షిరూర్ పట్టణంలోని భీమా కోరెగావ్ ప్రాంతంలో గల ఎయిర్ ఫిల్టర్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. కంపెనీ నుండి పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలతో దట్టంగా పొగ వ్యాపించింది. ఫ్యాక్టరీ యాజమాన్యం సమాచారంతో అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.

ఆరు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఇద్దరు కార్మికులకు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కర్మాగారంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో కార్మికులు అంతా బయటకు పరుగులు తీశారు. ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రమాదం కారణంగా ఫ్యాక్టరీకి భారీ నష్టం వాటిల్లినట్లుగా భావిస్తున్నారు.
#WATCH | Fire breaks out in an Air filter company near Bhima Koregaon area of Shirur town in Pune. Six fire tenders have reached the spot. Two workers were injured: Pune Fire Department pic.twitter.com/Lfkum8hqNq
— ANI (@ANI) December 17, 2022