Fire Accident: హైదరాబాద్ గాంధీనగర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామిక వాడలోని రంగారెడ్డినగర్ లో గల ప్రేరణి ఫ్లైవుడ్ గోడౌన్ లో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
గోడౌన్ లో కర్రలు ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటల కారణంగా వ్యాపించిన పొగతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. బాలానగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్తినష్టం భారీగానే ఉంటుందని అనుకుంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?