Indonesia: జైలులో భారీ అగ్నిప్రమాదం ..! 41 మంది ఖైదీలు సజీవదహనం..!!

Share

Indonesia: ఇండోనేషియా రాజధాని జకర్తాలోని బాంటెన్ ప్రావిన్స్ జైలులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 41 మంది ఖైదీలు సజీవ దహానం అయ్యారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని జైలు అధికారులు పేర్కొంటున్నారు.

Fire accident in Indonesia
Fire accident in Indonesia

జకార్తా సరిహద్దులో గల బాంటెన్ ప్రావిన్స్ జైలు సీ బ్లాక్ లో మంటలు అంటుకున్నాయి. ఈ బ్లాక్ లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో అరెస్టు అయిన ఖైదీలు ఉంటారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ బ్లాక్ లో ఎంత మంది ఖైదీలు ఉన్నారనేది ఇంకా తెలియరాలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. వందలాది మంది పోలీసులు, సైనికులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంపై ఇండోనేషియా న్యాయ, మానవహక్కుల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని జైళ్ల శాఖ అధికార ప్రతినిధి అఫ్రింటి స్పందించారు. ఘటనలో 41 మంది మరణించారని చెప్పారు. జైలులో అగ్నిప్రమాదం జరగడంతో సహాయక సిబ్బంది ఖైదీలను సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నాలు చేశారని వెల్లడించారు.

ఈ జైలులో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారు. 1,225 మంది సామర్థ్యం కల్గిన ఈ జైలులో ప్రస్తుతం 2 వేల మంది ఖైదీల వరకూ ఉన్నారు. సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండటం సమస్యగా మారింది. మరో పక్క ప్రభుత్వం జైలు నిర్వహణకు సరిపడా నిధులు మంజూరు చేయకపోవడంతో జైలులో కనీస వసతులు కొరవడ్డారు. దీంతో ఖైదీల మధ్య ఘర్షణలు, కొంత మంది తప్పించుకోవడానికి ప్రయత్నించడం లాంటి సంఘటనలు జరిగాయి. ఈ క్రమంలో పలు మార్లు చిన్న చిన్న అగ్నిప్రమాదాలు జరిగాయి. అయితే ఇంత భారీ అగ్నిప్రమాదం జరగి పెద్ద ఎత్తున ప్రాణ హానికి కారణం కావడం ఇదే ప్రధమమని అధికారులు చెబుతున్నారు.


Share

Related posts

హైపర్ ఆదికి కోలుకోలేని షాక్ ఇచ్చిన దుర్గారావు..! 

arun kanna

అతను చనిపోతే అమ్మాయిలందరూ హమ్మయ్య అనుకున్నారు…. ఎందుకలా? 

Naina

ఏపీ కేబినెట్ భేటీ నేడు

Siva Prasad