Fire Accident హైదరాబాద్ మల్లాపూర్ పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జేపి ఇండస్ట్రీస్ (రసాయన పరిశ్రమ)లో మంటలు ఎగిసిపడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. భారీగా మంటలు, పొగ వ్యాపించడంతో స్థానికులు పరుగులు తీశారు. సమాచారం తెలియడంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చేస్తున్నారు.

పరిశ్రమలో కెమికల్ ఉండటంతో ఓ పక్క మంటలను అగ్ని మాపక సిబ్బంది అదుపు చేస్తున్నా మరో పక్క మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ పారిశ్రామిక వాడలో ఇంతకు ముందు కూడా అగ్ని ప్రమాదాలు జరిగినా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
YS Jagan: చంద్రబాబు సెల్పీలకు జగన్ కౌంటర్ ఇది