ముంబైలో అగ్రిప్రమాదం-ఐదుగురు మృతి

ముంబై బహుళ అంతస్తుల భవనంలో ఈ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు మరణించారు. తిలక్ నగర్ లోని బహుళ అంతస్తుల భవనం 11వ అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.

ముగ్గురు గాయపడ్డారు. షార్ట్ సర్క్యట్ కారణంగా ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. గ్యాస్ సిలెండర్లు పేలడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించి దట్టమైన పొగ అలుముకోవడంతో ఊపిరాడక ఐదుగురు మరణించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.