Fire breaks In Kolkata: టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా నివాసంలో అగ్నిప్రమాదం..

Share

Fire breaks In Kolkata: కోల్‌కతాలోని టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్ర నివాసంలో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. మిత్ర నివాసం ఉంటే పురాతన భవనం గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఒక్క సారిగా మంటలు ఎగిసిపడటంతో మిత్రాతో సహ కుటుంబ సభ్యులు ఇంట్లో నుండి హుటాహుటిన బయటకు వచ్చారు. అగ్ని ప్రమాద సమాచారాం ఇవ్వడంతో మూడు ఫైర్ ఇంజన్ లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉంటాయని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనకు స్పష్టమైన కారణం తెలియకపోయినా ఫ్యూరిఫైయర్ కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

Fire breaks out at tmc mla madan mitra's residence
Fire breaks out at tmc mla madan mitra’s residence

అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ఘర్షణలు చెలరేగుతున్న నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యే నివాసంలో అగ్నిప్రమాదం జరగడం కలకలాన్ని రేపింది. అయితే ఈ ప్రమాదం నుండి ఎమ్మెల్యే కుటుంబం సురక్షితంగా బయటపడ్డారు.


Share

Related posts

అల్లు అర్జున్ పుష్ప 5 భాషల్లో ఎందుకు వస్తుందో తెలుసా..?

GRK

Cyberabad Police : హెల్మెట్ విషయంలో సైబరాబాద్ పోలీసులు సరికొత్త డెసిషన్..!! 

sekhar

విజయసాయి రెడ్డి తొందర పడ్డారా?? : విశాఖ వాసుల్లో ఆందోళన

Special Bureau