న్యూస్

బ్రేకింగ్: సాలూరు పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు …మ్యాటర్ ఏమిటంటే…?

Share

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. పోలీస్ స్టేషన్ లో సీజ్ చేసిన బాణాసంచా కు నిప్పు అంటుకోవడం వల్ల ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తొంది. పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ గోడలు బీటలు వారగా, పక్కనే ఉన్న షెడ్డు రేకులు ఎగిరిపడ్డాయి. ఈ ఘటనతో పోలీస్ స్టేషన్ సిబ్బంది ఒక్క సారిగా బయటకు పరుగులు తీశారు. భారీ పేలుడు శబ్దం గ్రామం మొత్తం వినిపించడంతో ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పోలీస్ స్టేషన్ వద్దకు పరుగులు తీశారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

firecrackers explosion

గతంలో సీజ్ చేసిన బాణాసంచాను పోలీస్ స్టేషన్ లో భద్రపర్చినట్లు తెలుస్తొంది. ఇప్పుడు ఆ బాణాసంచా పేలడం వల్ల ఈ భారీ పేలుడు సంభవించిందని అనుకుంటున్నారు. సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా పోలీస్ స్టేషన్ లో సీజ్ చేసిన బాణా సంచా నిల్వ చేయడం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు.

రికార్డు సృష్టించిన బాలాపూర్ గణేష్ లడ్డూ..వేలంలో ఈ సారి ధర ఎంత పలికింది అంటే..?


Share

Related posts

పోరాటం ఉగ్రవాదంపైనే..కశ్మీర్‌పై కాదు – మోది

somaraju sharma

Janhvi Kapoor Latest Wallpapers

Gallery Desk

Sai Dharamtej: సాయి ధరమ్ తేజ్ కి చికిత్స అందిస్తున్న హాస్పిటల్ వద్ద ఎమోషనల్ అయినా మంచు మనోజ్..!!

sekhar