Omicron: దక్షిణాఫ్రికాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ లోని కొత్త వేరియంట్ ఒమైక్రాన్ క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తోంది. వారం రోజుల క్రితం కర్ణాటకలో రెండు ఒమైక్రాన్ కేసులు వెలుగు చూడటంతో భారత ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అన్ని రాష్ట్రాలకు కోవిడ్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు నిర్వహించిన తరువాతనే వాళ్లను గమ్యస్థానాలకు అనుమతిస్తూ వస్తున్నారు. కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన వాళ్లను వెంటనే ఆసుపత్రులకు తరలించడంతో పాటు వారికి సోకింది ఓమైక్రాన్ వేరియంటా కాదా అనే దానిపై శాంపిల్స్ తీసి జీనోమ్ పరీక్షలకు పంపుతున్నారు. కర్ణాటక తరువాత ఢిల్లీ, ముంబాయి తదితర రాష్ట్రాల్లో వివిధ దేశాల నుండి వచ్చిన వారికి ఓమైక్రాన్ సోకినట్లు గుర్తించారు.
తాజాగా ఏపిలోని విజయనగరం జిల్లాలో ఓమైక్రాన్ వేరియంట్ కేసు వెలుగు చూసింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గత నెల 27న ఇర్లాండ్ నుండి వచ్చిన ఓ వ్యక్తికి ముంబాయి విమానాశ్రయంలో పరీక్షలు చేయగా కోవిడ్ నెగిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో అధికారులు అతని గమ్యస్థానికి వెళ్లడానికి అనుమతించారు. ఆ ప్రయాణీకుడు ముంబాయి నుండి విశాఖపట్నం విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుండి విజయనగరం చేరుకున్నాడు. విజయనగరంలో మరో మారు పరీక్ష చేయగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అతను ఇతర దేశం నుండి వచ్చిన ప్రయాణీకుడు కావడంతో వెంటనే అధికారులు అప్రమత్తమై అతని నుండి కలెక్ట్ చేసిన శాంపిల్ ను జినోమ్ టెస్టింగ్ కోసం పంపగా ఓమైక్రాన్ వేరియంట్ సోకినట్లు తేలింది. విజయనగరం చేరుకున్న ఓ వ్యక్తికి ఓమైక్రాన్ సోకిందని తెలియడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏపిలో తొలి ఒమైక్రాన్ కేసు వెలుగు చూసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దృవీకరించారు. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…