NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

T20 World Cup 2021 Final: 2021 T20 ప్రపంచ కప్ విజయం సాధించి హిస్టరీ క్రియేట్ చేసిన ఆస్ట్రేలియా..!!

Share

T20 World Cup 2021 Final: దుబాయ్(Dubai) వేదికగా 2021 టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన విషయం తెలిసిందే. ముందుగా టాస్ గెలిచి ఆస్ట్రేలియా(Ausralia) బౌలింగ్ తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మొదట బ్యాటింగ్ కి  దిగిన న్యూజిలాండ్(New Zealand) నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఓపెనర్ లు మార్టిన్ గప్టిల్ (28), డారిల్ మిచెల్ (11) తొలి వికెట్‌గా 28 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఓపెనర్స్ పెద్దగా భాగస్వామ్యం అందించ లేకపోవడం… అనంతరం బ్యాటింగ్ కి బరిలోకి దిగిన న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు కూడా పెద్దగా రాణించలేకపోవడంతో కీలక మ్యాచ్ లో కివీస్ చేతులెత్తేసినట్లే అయింది.

NZ vs AUS Highlights, T20 WORLD CUP 2021 Final: New Zealand Vs Australia T20 Final.

కేవలం కెన్ విలియంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి న్యూజిలాండ్ జట్టులో ఆకట్టుకున్నాడు. 48 బంతుల్లోనే దాదాపు 85 పరుగులు సాధించి… ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 10 ఫోర్లు 3 సిక్స్ లు.. కెన్ విలియమ్స్ కొట్టడం జరిగింది. ఆ తర్వాత మిగిలిన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు .. అంతగా ఏమీ రాణించలేదు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ 3 వికెట్లు, ఆడం జంపా 1 వికెట్ పడగొట్టారు. అనంతరం 173 పరుగుల లక్ష్యాన్ని సాధించడం కోసం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లు… ఒక ఓవర్లు మిగిలి ఉండగానే చేధించారు.

Australia won the T20 World Cup final by 8 wickets

ఫస్ట్ టైం టీ20 కప్ గెలిచినా ఆస్ట్రేలియా..

ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ లలో మిచెల్‌ మార్షల్ 77 పరుగులతో జట్టును విజయ తీరాలకుచేర్చాడు. 50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. డేవిడ్‌ వార్నర్ అర్ద సెంచరీతో అదరగొట్టాడు. గ్లెన్ మాక్స్‌వెల్ 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కివీస్‌ బౌలర్లలో బోల్ట్‌ రెండు వికెట్లు తీయగా మిగతా వారు… అంతగా ఏమీ రాణించలేదు. ఏది ఏమైనా వన్డే ఫార్మాట్ లలో అనేక ప్రపంచ కప్పులు గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలి సారి t20 ఫార్మాట్ లో  2021 ప్రపంచ కప్ గెలవడంతో చరిత్ర సృష్టించినట్లు అయింది. ఈ సందర్బంగా ఆస్ట్రేలియా క్రికెట్ ఫాన్స్ ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు.


Share

Related posts

నిమ్మగడ్డ రీఎంట్రీ ! గవర్నర్ ద్వారా రానున్న మాజీ ఎస్.ఇ.సి?

Yandamuri

Chandrababu : హై వోల్టేజ్ బ్రేకింగ్ న్యూస్ : చంద్రబాబు కి ‘ కమ్మటి ‘ షాక్ తగిలింది .. ఇప్పట్లో కోలుకోవడం ఇంపాజిబుల్ !

sekhar

AP : ఆంధ్రప్రదేశ్ లో వీటి మాంసానికి ఉన్నంత డిమాండ్ దేనికీ లేదు..! ఇంతకీ తినొచ్చా…?

siddhu