24.2 C
Hyderabad
February 5, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

మాండస్ తుఫాన్ ఎఫెక్ట్ .. సముద్రంలో చిక్కుతున్న మత్స్యకారుల బోటు .. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

Share

మాండస్ తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లాలో మత్స్యకారుల బోటు సముద్రంలో చిక్కుకుపోయింది. చీరాల మండలం వాడరేవుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఆరు రోజుల క్రితం బోటులో చేపల వేటకు వెళ్లారు. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వారు తీరానికి రాలేకపోయారు. సముద్రంలో చిక్కుకున్న విషయాన్ని వాళ్లు కుటుంబ సభ్యులకు సెల్ ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సెల్ ద్వారా వారు ఉన్న లోకేషన్ షేర్ చేశారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులు వెంటనే విషయాన్ని అధికారులకు సమాచారం అందించగా, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే రంగంలోకి దిగి వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టారు.

mandus tufan

 

అయితే తుఫాను తీవ్రతతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామానికి కిలో మీటరు దూరంలో మత్స్యకారుల బోటు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారీ వర్షం, తీవ్ర గాలుల వల్ల ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మత్స్యకారుల బోటు వద్దకు చేరలేకపోతున్నారు. దీంతో మరో బోటు సహాయంతో వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా మాండూస్ తుఫానుకు సంబందించి పది రోజుల నుండి అధికార యంత్రాంగం మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దంటూ హెచ్చరికలు జారీ చేసినా ఆ హెచ్చరికలను బేఖాతరు చేయడం వల్ల ఇబ్బందులను కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నానా ఇబ్బందులు పడుతున్నాయి.


Share

Related posts

Bigg boss Noel : బిగ్ బాస్ నోయెల్ కొత్త రాప్ సాంగ్ ప్రోమో అదిరిపోయింది

Varun G

బదిలీపై కోర్టులోనే వివరణ

sarath

Murder in Kakinada : కార్పొరేటర్ దారుణ హత్య..! ఎలా చంపారో చూస్తే కన్నీళ్లు ఆగవు..!!

somaraju sharma