Local Boi Nani : సముద్రంలో చేపలు ఎలా పడతారో చాలామందికి తెలియదు. సముద్రాన్నే చూడని వాళ్లు చాలామంది ఉంటారు. ఇక.. గంగపుత్రులు సముద్రంలోకి వేటకు ఎప్పుడు వెళ్తారో? ఎలా సముద్రపు చేపలను పడతారో ఎలా తెలుస్తుంది. సముద్రపు చేపలంటే ఇష్టం ఉండని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. సముద్రపు చేపలు తింటే ఎంతో మంచిది. ఉప్పు చేప ఆరోగ్యానికి చాలామంచిదని డాక్టర్లు చెబుతుంటారు. కానీ.. సముద్రపు చేపలను పట్టడం ఎంత కష్టమో తెలుసా?

అసలు సముద్రంలో చేపలను ఎలా పడతారు. చేపలు పట్టే పడవ ఎలా ఉంటుంది. సముద్రంలో వేటకు వెళితే రోజులకు రోజులు సముద్రంలోనే గడుపుతారు కొందరు. అటువంటప్పుడు వాళ్లకు తిండి, నీళ్లు ఎలా? బాత్ రూమ్ కు ఎలా వెళ్తారు… ఇలాంటి ఎన్నో డౌట్లకు సమాధానమే లోకల్ బాయ్ నాని.
Local Boi Nani : యూట్యూబ్ లో ట్రెండింగ్ లో లోకల్ బాయ్ నాని చానెల్
వైజాగ్ కు చెందిన టిక్ టాక్ స్టార్ లోకల్ బాయ్ నాని… తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ ఏర్పాటు చేశాడు. టిక్ టాక్ బ్యాన్ కాకముందు… టిక్ టాక్ లో సరదాగా తను చేపలు పట్టే వీడియోలను పోస్ట్ చేసేవాడు. అయితే.. ఆ వీడియోలకు మంచి రెస్పాన్స్ రావడంతో….. వెంటనే తన ఫ్రెండ్స్ సాయంతో ఒక యూట్యూబ్ చానెల్ ఏర్పాటు చేసి… సముద్రంలో వాళ్లు ఎలా చేపలు పడుతారో వీడియోలు తీసి ఆ చానెల్ లో పెట్టడం ప్రారంభించాడు.
తన వీడియోలను మంచి రెస్పాన్స్ రావడంతో… రోజురోజుకూ వీడియోలను పెంచుతూ… యూట్యూబ్ స్టార్ అయిపోయాడు నాని.
తాజాగా డే టైమ్ లో సముద్రంలో చేపలను ఎలా పడతారో చూపించడం కోసం కొత్త వీడియోను అప్ లోడ్ చేశాడు నాని. ఇంకెందుకు ఆలస్యం… మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరి.