తెలుగు రాష్ట్రాల్లో పలువురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి ఇద్దరు, తెలంగాణ హైకోర్టు నుండి ముగ్గురు న్యాయమూర్తుల బదిలీకి సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అదే విధంగా మద్రాస్ హైకోర్టు నుండి ఇద్దరు జడ్జిలు బదిలీ అయ్యారు.

ఏపి హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫార్సు చేసిన కొలీజియం .. ఇదే హైకోర్టులోని మరో న్యాయమూర్తి జస్టిస్ రమేష్ ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సూచించింది. అదే విదంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత ను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. మరో జడ్జి జస్టిస్ నాగార్జున్ ను మద్రాస్ హైకోర్టుకు. జస్టిస్ అభిషేక్ రెడ్డిని పట్నా హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది.
మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజాను రాజస్థాన్ హైకోర్టుకు, అదే న్యాయస్థానంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ వేలుమణిని కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కొలీజియం సిఫార్సు చేసింది.
ఐటీ దాడుల్లో బిగ్ ట్విస్ట్ .. మంత్రి మల్లారెడ్డి Vs ఐటీ .. కేసు, కౌంటర్ కేసులు నమోదు