ఐక్య రాజ్య సమితిని వణికిస్తున్న కరోనా..!!

 

కరోనా ప్రపంచ దేశాలను గజగజలాడిస్తుంది. కరోనా మహమ్మారి వల్ల ఎనో సంస్థలు మూతపడాయి , ప్రపంచ దేశాలు అని ఆర్ధిక మాంద్యం తో సతమతం అవుతున్నాయి అనే విషయం అందరికి తెలిసిందే. ప్రపంచ దేశాలు అంతర్జాతీయ చట్ట భద్రతలు, ఆర్థిక సామాజిక అభివృద్ధి , మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ఏర్పాటు చేసుకున్న అంతర్జాతీయ సంస్థ అయినా న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి (యునైటెడ్‌ నేషన్స్) ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం రేపింది.అందులో ఉన్న 5 దేశాల ప్రతినిధులకు కరోనా సోకింది అనే విషయాన్నిఆ సంస్థకు చెందిన అధికార ప్రతినిధి తెలిపారు. దీంతో వ్యక్తిగత సమావేశాలను రద్దు చేస్తూ ఐక్యరాజ్యసమితి నిర్ణయం తీసుకుంది. వెంటనే అప్రమత్తమైన యూఎన్ మెడికల్ సర్వీస్‌ కాంటాక్ట్‌లను ట్రేస్ చేసే పనిలో పడింది. మంగళవారం జరగాల్సిన వ్యక్తిగత సమావేశాలను రద్దు చేశాము” అని ప్రతినిధి స్పీఫెన్‌ దుజారిక్ తెలిపారు. అయితే ఆ ఐదుగురు ఏ దేశాల ప్రతినిధులన్న విషయాన్ని వెల్లడించలేదు.

 

పలు దేశాలు తాము కరోనా మహమ్మారిని సమర్థవంతంగా అడ్డుకున్నామని చెప్తున్నప్పటికి. సెకండ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తూన్నారు. కరోనా సెకండ్ వేవ్ వస్తే మాత్రం అడ్డుకోవడం చాలా కష్టమని డాక్టర్స్ అంటున్నారు. ఇప్పటికే ఆసుపత్రుల్లో రోగులు ఉన్న కారణంగా కరోనా సెకండ్ వేవ్ రాకుండా అతి జాగ్రత్తగా ఉండాలని, స్వీయ రక్షణ ముఖ్యమని, మాస్క్ ధరిస్తూ సోషల్ డిస్టెన్సిన్గ్ పాటించాల్సి ఉంది అని ఆధికారులు తెలుపుతున్నారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో కూడా పలు ఊహాగానాలు ప్రపంచ వ్యాప్తంగా వస్తూ ఉన్నాయి. నవంబర్ నెలలో కరోనా వ్యాక్సిన్ ను ఇవ్వబోతున్నారని చెబుతూ ఉండగా.. మరో వైపు వచ్చే ఏడాది మొదటి అర్ధభాగంలో కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వాలు తెలియచేస్తున్నాయి