న్యూస్ సినిమా

ఈ వారంలో ఐదు కొత్త సినిమాలు రిలీజ్.. అయినా పట్టించుకోని ప్రేక్షకుడు..!

Share

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ కొత్త సినిమాలతో కళకళలాడుతున్నాయి. బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉన్నా సరే శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పోటీపడుతున్నాయి. కరోనా టైమ్‌లో థియేటర్లు మూసేసినా కూడా ఓటీటీలో కొత్త సినిమా రిలీజ్ అయి ఎంతో వినోదాన్ని పంచాయి. టాలీవుడ్‌లో సినిమాల సంఖ్య అంతగా పెరిగిపోయింది మరి. కాగా ప్రస్తుతం టాలీవుడ్‌లో మూడు కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి.

ఆ సినిమాలకు పోటీగా రిలీజ్!

ఆగస్టు మొదటి వారంలో రిలీజ్ అయిన బింబిసార, సీతారామం సినిమాలు హిట్స్‌గా నిలిచాయి. సినిమాకి పెట్టిన బడ్జెట్ కూడా తిరిగి వచ్చింది. గతవారం రిలీజ్ అయిన కార్తికేయ 2 సినిమా కూడా ఏమాత్రం తగ్గకుండా హౌస్ ఫుల్ బోర్డులతో రన్ అవుతుంది. ఈ మూడు సినిమాలకే థియేటర్లు సర్దుబాటు చేయడం కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే, ఈ వారం ఏకంగా ఐదు సినిమాలు థియేటర్లోకి రావడం అనేది పరిస్థితిని మరింత క్లిష్టతరంగా మార్చేసింది. తాజాగా ధనుష్ డబ్బింగ్ సినిమా ‘తిరు’ గురువారమే థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమాని పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. నిజానికి ఈ సినిమా మంచిగానే ఉంది. అయినా టాలీవుడ్ ప్రేక్షకులు కార్తికేయ-2 బిందుసార, సీతారామన్ తప్ప మిగతా వాటిపై ఆసక్తి చూపడం లేదు. ప్రమోషన్లు కూడా ఎక్కువగా జరుపుకోని ఈ సినిమా ఒకటి రిలీజ్ అయిందని కూడా ఎవరికీ తెలియదు.

పట్టించుకోని ప్రేక్షకులు

ఇక శుక్రవారం చిన్న సినిమాలు చాలానే రిలీజ్ అవుతున్నాయి. వాటిలో సునీల్ ప్రధాన పాత్ర పోషించిన ‘వాంటెడ్ పండుగాడు’ఒకటి. ఈ చిత్రానికి శ్రీధర్ సిపాన దర్శకతం వహించగా… వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్‌ వంటి చాలా మంది కమెడియన్లు యాక్ట్ చేశారు. ఇది కూడా తుస్సుమంది. ఇక వరుస ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న ఆది సాయికుమార్ ఈసారి తన ‘తీస్ మార్ ఖాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది ఫస్ట్ షోకే అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కమిట్‌మెంట్ అనే అడల్ట్ రేటెడ్ మూవీ తాజాగా రిలీజ్ అయింది. మాట రానీ మౌనమిది అనే ఇంకో చిన్న సినిమా ఈ వారంలో రిలీజ్ అవుతోంది. కానీ మూడు మంచి సినిమాలు ఆడుతున్న వేళ వీటిని ఎవరు చూస్తారన్నదే పెద్ద ప్రశ్నార్థకం!


Share

Related posts

Gas Cylinder Blast: మదనపల్లె ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ పేలుడు..! ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు..! మేటర్ ఏమిటంటే..!!

somaraju sharma

Telangana బిగ్ బ్రేకింగ్ : ఓట్ల లెక్కింపులో గందరగోళం ఆగిపోయిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ..!!

sekhar

Relationship మీ భాగస్వామి లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అనుమానం పడవలసిందే!!

Kumar