Flaxseed Gel Benefits: అవిసె గింజల మేలు తెలిస్తే మహిళలు వదిలిపెట్టరు..! వాటిని ఎలా ఉపయోగించుకోవాలంటే..?

Share

Flaxseed Gel Benefits: అవిసె గింజలతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అవిసె గింజలతో సలాడ్‌లతో పాటు అనేక రకాల వంటకాలు కూడా చేసుకోవచ్చని అంటున్నారు. అవిసె గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందున వాటిని పలు ఔషధ తయారీలో ఉపయోగిస్తారు. ప్రధానంగా మహిళల జుట్టు సంరక్షణకు కూడా అవిస గింజలను ఉపయోగించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విత్తనాల నుంచి జెల్ (ఫ్లాక్స్ సీడ్ జెల్) ను తయారు చేసుకోవచ్చు. ఇది మహిళల జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండటానికి దోహదపడుతుంది. అవిసె గింజల జెల్ తయారు చేసుకోవడం, వాటి వల్ల ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Flaxseed Gel Benefits for hair
Flaxseed Gel Benefits for hair

Flaxseed Gel Benefits: జెల్ ఇలా తయారు చేసుకోవాలి

అవిస గింజలతో హెయిర్ జెల్ తయారు చేయడానికి ప్రధానంగా నాలుగు పదార్థాలు తీసుకోవాలి. నాలుగు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు, ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్, రెండు టీస్పూన్ ఆల్మండ్ ఆయిల్ సిద్దం చేసుకోవాలి. ముందుగా రెండు కప్పుల నీళ్లు మరిగించి అందులో అవిసె గింజలు వేయాలి. నీరు చిక్కబడే వరకు ఉడికిన తరువాత జెల్లీ లాంటి అవశేషాలను జల్లెడ లేదా మెత్తటి క్లాత్‌ను ఉపయోగించి ఫిల్టర్ చేసుకోవాలి. ఆ మిశ్రమం చల్లారిన తరువాత అందులో అలోవెరా జెల్, విటమిన్ ఇ క్యాప్సూల్స్, బాదం నూనె వేసి బాగా కలపాలి. దాంతో అది జెల్ లాగా తయారు అవుతుంది. చల్లని ఉష్ణోగ్రతలో ఈ మిశ్రమాన్ని ఒక కూజాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని మీ జుట్టుకు పట్టించి మసాజ్ చేసి ఒక గంట సేపు ఉంచి తలస్నానం చేస్తే జుట్టు తళతళ మెరుస్తుంది.

అవిస గింజల హెయిర్ జెల్ ప్రయోజనాలు

ఈ జెల్ మహిళల జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా వేగంగా జుట్టు పెరుగుదలకు సహాయపడే బీ విటమిన్లను కూడా జుట్టుకు అందిస్తాయట. అవిసె గింజల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. అంతే కాకుండా అవిసె గింజల్లో తేమ గుణాలు ఎక్కువగా ఉంటాయట. అవిసె గింజల్లో ఉండే ఫైబర్ మరియు ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టును బలంగా మార్చడంలో సహాయపడతాయి.


Share

Related posts

KCR: వ‌రంగ‌ల్‌లో అడుగుపెట్ట‌క ముందే కేసీఆర్ కు దిమ్మ‌తిరిగిపోయే షాక్

sridhar

ఆ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేకు గ్రామస్తుల షాక్..!!

somaraju sharma

International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు..!!

bharani jella