NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Flipkart Delivery: ఆన్‌లైన్‌లో వాచ్ కొనుగోలు చేస్తే వచ్చింది ఇదీ.. ప్యాకెట్ ఓపెన్ చేస్తే షాక్

Flipkart Delivery: ఇటీవల కాలంలో చాలా మంది ఆన్‌లైన్‌లో ఆర్డర్‌లు పెట్టడానికి మక్కువ చూపుతున్నారు. ఏం కావాలన్నా చకచకా ఆర్డర్లు పెట్టేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాలలో ప్రజలకు వింత అనుభవం ఎదురవుతోంది. ముఖ్యంగా ఒకటి ఆర్డర్ ఇస్తే ఇంకొకటి డెలివరీ అవుతోంది. ల్యాప్ టాప్ ఆర్డర్ ఇస్తే రాళ్లు, ఇటుకలు వంటివి వస్తున్నాయి. తాజాగా ఓ మహిళకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. ఖరీదైన వాచ్‌ను ఆర్డర్ ఇస్తే ఆవు పేడతో చేసిన పిడకలు డెలివరీ అయ్యాయి. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

Flipkart Delivery: వివరాల్లోకి వెళితే

యూపీలోని కౌశాంబిలోని కసెండా గ్రామానికి చెందిన నీలం యాదవ్ అనే మహిళ ఇటీవల యాప్‌లో షాపింగ్ ఫెస్టివల్ సందర్భంగా వాచ్‌ని ఆర్డర్ చేసింది. దానిని నీలమ్ తన సోదరుడు రవేంద్ర కోసం కొనుగోలు చేసింది. నీలం తన ఆర్డర్‌ని సెప్టెంబర్ 28న చేసింది. డెలివరీ సమయంలో రూ. 1,304 మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించాలని నిర్ణయించుకుంది. ఇది తొమ్మిది రోజుల తర్వాత అక్టోబర్ 7న డెలివరీ వచ్చింది. దానిని ఆమె సోదరుడు రవీంద్ర రిసీవ్ చేసుకున్నాడు. ప్యాకెట్‌లో అందమైన చేతి గడియారం ఉందని అతను భావించాడు. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ నుంచి తీసుకుని, దానిని విప్పి చూడగా వారంతా షాక్ అయ్యారు. తన సోదరికి నాలుగు చిన్న ఆవు పేడ కేక్‌ల ప్యాకెట్‌ని అందించాడని చూసి అతను షాక్ అయ్యాడు.

తర్వాత ఏమైంది

ఈ అసౌకర్యంతో వారు చాలా ఇబ్బంది పడ్డారు. డెలివరీ బాయ్‌ని రవీంద్ర పిలిచి, ఫిర్యాదు చేశాడు. తనకు వాచ్ బదులుగా పేడతో చేసిన పిడకలు వచ్చాయని చెప్పాడు. డెలివరీ చేసిన వ్యక్తి డబ్బును తిరిగి ఇవ్వడానికి అంగీకరించాడు. ఈ ఏడాది ప్రారంభంలో, ఐఐఎం-అహ్మదాబాద్ గ్రాడ్యుయేట్ అయిన యశస్వి శర్మ తన తండ్రికి ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు. ‘బిగ్ బిలియన్ డే’ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేశాడు. కానీ అతను దానికి బదులుగా ఘాడీ డిటర్జెంట్ అందుకున్న తర్వాత అతను షాక్ అయ్యాడు. ఆన్‌లైన్ షాపింగ్ ఇలా కస్టమర్లకు చేదు అనుభవాలను మిగుల్చుతున్నాయి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju