Flipkart Delivery : ఫ్లిప్ కార్ట్ యూజర్లకు ఇది నిజంగా శుభవార్తే. మీరు గ్రాసరీస్ ఆర్డర్ చేయాలని భావిస్తే మాత్రం ఈ వార్త మీకు బాగా ఉపయోగపడుతుంది. ఆర్డర్ చేసిన కేవలం 45 నిముషాలలోనే డెలివరీ చేస్తామని ఫ్లిప్కార్ట్ తాజాగా వెల్లడించింది. మనకు తెలిసిందే.. షార్ట్ టైములో బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్స్టామార్ట్, డుంజో వంటి సంస్థలు 15 నుంచి 20 నిమిషాల్లోనే డెలివరీ సర్వీసులు అందిస్తున్నాయి. అయితే ఫ్లిప్కార్ట్ మాత్రం 10 నుంచి 20 నిమిషాల డెలివరీ సర్వీసులు కష్టం గాని ఖచ్చితంగా 45 నిముషాలలోపు సర్వీస్ చేయడం సులువవుతుందని చెప్పుకొచ్చింది.
Flipkart Delivery : గ్రాసరీస్ సంగతి:
ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ డెలివరీ సేవలను మరింత విస్తరించాలనే నెపంతో ఫ్లిప్కార్ట్ ఈ సేవలు అందుబాటులోకి తెచ్చినట్టుగా సమాచారం. ఫ్లిప్కార్ట్ CEO కల్యాణ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. కస్టమర్లకు నాణ్యమైన సర్వీసులు అందించాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఫ్లిప్కార్ట్ తాజా నిర్ణయంతో 90 నిమిషాల డెలివరీ సర్వీసులు ఇప్పుడు 45 నిమిషాలకి కుదించబడింది. రానున్న రోజుల్లో చాలా ప్రాంతాల్లో ఈ క్విక్ సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.
మరిన్ని వివరాలు:
హైదరాబాద్, బెంగూళరులో ఫ్రెష్ వెజిటబుల్స్ సర్వీసులు అందుబాటులో ఇప్పటికే అందుబాటులో వున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఫ్రూట్ డోర్ డెలివరీ సర్వీసులు కూడా అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా చెప్పారు. అలాగే ఈ సర్వీసులు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని తెలిపారు. కాగా ఫ్లిప్కార్ట్ అందిస్తున్న క్విక్ డెలివరీ సర్వీసుల కింద 90 నిమిషాలు లేదా 2 గంటల్లో డెలివరీ పొందొచ్చు. దీని కోసం రూ.29 డెలివరీ చార్జ్ పడుతుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.