Tollywood heros: ఈ మధ్యకాలంలో ఫ్లాప్ హీరోయిన్స్ అని ముద్ర పడిన హీరోయిన్స్‌కు మన స్టార్ హీరోలు, దర్శకులు బాగానే అవకాశాలిస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. వారి సినిమాకు పెద్దగా కలిసివచ్చేది లేకపోయినా తమకున్న స్టార్ డైం మీద నమ్మకంతో డైరెక్టర్లు – హీరోలు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారట. మహానటి సినిమా తర్వాత హిట్ అంటూ దక్కని కీర్తి సురేశ్‌కు నితిన్, మహేశ్ బాబు తమ సినిమాలలో హీరోయిన్గా అవకాశాలిచ్చారు. నితిన్‌తో రంగ్ దే సినిమా చేసి ఒక మోస్తారు హిట్ అందుకున్న కీర్తి ఇప్పుడు మహేశ్ బాబుతో సర్కారు వారి పాట సినిమా చేసే అవకాశం అందుకుంది.
కెరీర్లో ఒక్క భారీ హిట్ కూడా తన ఖాతాలోని కేథరీన్‌కు నితిన్ తాజాగా తను నటిస్తున్న మాచర్ల నియోజిక వర్గం సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో హీరోయిన్గా ఇప్పటికే కృతిశెట్టి కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు కేథరీన్ కూడా నటిస్తున్నట్టు ప్రకటించారు. ఇది హీరోయిన్ రోల్ ఆ లేకపోతే ఏదైనా స్పెషల్ క్యారెక్టరా అనేది తెలియాల్సి ఉంది. ఇక గతకొంతకాలంగా హిట్ అంటూ లేని లావణ్య త్రిపాఠికి కూడా మహేశ్ బాబు తన నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వచ్చి వైరల్ అవుతోంది. లావణ్య అకౌంట్లో సోగ్గాడే చిన్ని నాయన, భలే భలే మగాడివోయ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి.
Tollywood heros: క్రేజ్‌లో లేని హీరోయిన్స్‌ను తీసుకుంటే బడ్జెట్ సేవ్ అవుతుంది.
అయినా ఆమె స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. అయితే ఇలా ఫ్లాప్ హీరోయిన్స్‌కు ఛాన్సులివ్వడం వెనక కూడా దర్శక నిర్మాతల స్వార్ధం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఎటూ సినిమా బిజినెస్ అంతా హీరో, దర్శకుల మీదే నడుస్తుంది. కాబట్టి కాస్త క్రేజ్‌లో లేని హీరోయిన్స్‌ను తీసుకుంటే అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేసినట్టూ ఉంటుంది..రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువ ఇవ్వొచ్చు. దాంతో బడ్జెట్ కూడా సేవ్ అవుతుంది. ఇలా రెండు విధాలా సినిమాకు ప్లస్ అవుతుందనే అసలు కథ. అందుకే పెద్ద డైరెక్టర్లు, హీరోలు ఇలాంటి ప్లాన్స్ వేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ఫ్లాప్ హీరోయిన్స్‌ను ఎంకరేజ్ చేసి ఛాన్సులివ్వడం ఒకరకంగా వారికి మంచిదే. సినిమా సూపర్ హిట్ అయితే మంచి క్రేజ్ వచ్చి కెరీర్ ట్రాక్ మీదకొస్తుంది కదా.