స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకులు

65 views

 

ముంబయి,జ‌న‌వ‌రి4 : స్టాక్‌మార్కెట్లు శుక్రవారంహైచ్చు త‌గ్గుల‌కు లోన‌య్యాయి. మొద‌ట లాభాలతో ప్రారంభమైనప్పటికీ.. తర్వాత నష్టాల్లోకి వెళ్ళాయి.ప్రారంభంలో సెన్సెక్స్‌ 70 పాయింట్లకు పైగా ఉండి లాభపడగా.. నిఫ్టీ 10,700 మార్క్‌ వద్ద కదలాడింది. ఆ తర్వాత మొద‌టి లాభాలను కోల్పోయి సూచీలు నష్టాల బాటలో న‌డిచాయి. ఉదయం 9.50 గంటలకు సెన్సెక్స్‌ 26 పాయింట్లు కోల్పోయి 35,487 వద్ద.. నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 10,662 వద్ద కొనసాగుతుంది.

భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, టాటా మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్టీపీసీ, ఐటీసీ షేర్లు లాభాల్లో ప‌య‌నిస్తుండ‌గా, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, అల్ట్రా టెక్‌ సిమెంట్‌ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.