Beauty: ఆడవారు అందం గా కనిపించాలి అని చాల ప్రయత్నాలు చేస్తుంటారు. పై కి అందం గా కనిపించడం తో పాటు.. వ్యక్తిగతం గా కూడా చాలా శుభ్రం గా ఉండడం అనేది ముఖ్యమైన విషయం. సహజం గా అమ్మాయిలకి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కాలేజీ, ఆఫీస్ లకు వెళ్లే వారికీ తీరిక సమయం తక్కువ గా ఉన్నాకూడా వ్యక్తిగత శుభ్రత మీద దృష్టి పెట్టి తీరవలిసిందే.. చర్మం అందం గా కనిపించాలి అని సన్ స్క్రీన్ లోషన్లు,మాయిశ్చరైజర్లు, అప్లై చేస్తే సరిపోదు. రోజుకు రెండు సార్లు కచ్చితం గా శుభ్రం గా స్నానం చేయాలి. ఇలా చేయడం వలన చర్మం పై మృతకణాలు పోయి చర్మం ఆరోగ్యం గా తాజాగా ఉంటుంది. అలాగే ఎదో ఒక సబ్బు అని కాకుండా, పిహెచ్ స్థాయి తక్కువ గా ఉండే సబ్బులను వాడడం సరైన పద్దతి.
అమ్మయిలు తమ వెజైనా శుభ్రం చేసుకోవడం లో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కొంతమంది అక్కడ బాగా గా సోప్ ను వాడుతుంటారు . ఇది అంట సరైన పద్దతి కాదు. అలాగే,అక్కడ మంచి వాసనా రావాలి అని రకరకాల క్లీన్సర్ లను వాడుతుంటారు.ఇలా వాడడం వలన ఇవి చర్మాన్ని పొడిబారేలా చేయడం తో పాటు ఎక్కువ కాలం వాడితే ఇన్ఫెక్షన్ల ను కలిగిస్తాయి. అస్సలు ఆ భాగం తనంత తానె శుభ్రపడుతుంది. కాబట్టి ఈ సున్నితమైన భాగాల శుభ్రం కోసం నీటిని వాడితే చాలు. ప్రైవేట్ పార్ట్స్ వంటి చోట్ల చెడు వాసన రాకుండా ఉండడం కోసం ఎప్పటికప్పుడు షేవింగ్ చేస్తూ శుభ్రం గా ఉంచుకోవాలి. అలా ఉంచుకోకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. నెలసరి సమయం లో ఇంకా ఎక్కువ శుభ్రతను పాటించాలి.