Gender: స్త్రీ ,పురుష బేధం లేకుండా లోదుస్తుల విషయం లో ఈ జాగ్రత్తలు పాటించండి !!

Share

Gender:  ఆడవారు,మగవారు  లో దుస్తుల విషయం లో   ఈ తప్పులు చేయడం వల్ల  చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది.  ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారో తెలుసుకుందాం.

Gender: ఫంగల్ ఇన్ఫెక్షన్

ఒకసారి వేసుకున్న బాగా చెమట పట్టిన అండర్ వేర్ ని  వాష్ చేయకుండా  మరోసారి కూడా వేసుకోవడం అనేది చాలా మంది చేసే పొరపాటు. ఇలా చేయడం వలన    ఇన్ఫెక్షన్ చాలా త్వరగా వచ్చేస్తాయి   బాక్టీరియా తో పాటు  ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం  చాలా ఎక్కువగా ఉంటుంది.    ఇలా చేయడం వలన చాల ఇబ్బంది కరమైన  దురదలు  వేధిస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా చెమట పట్టి ఉతకని వాటిని వేసుకునే ప్రయత్నం చేయకండి. ఒక్కసారేగా ఏమవుతుంది అనుకుంటే  ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒకసారి వస్తే చాలా రోజుల తరబడి తగ్గదు అని గుర్తు పెట్టుకోండి.

సైజు విషయం లో

మీ సైజ్ కి కరెక్ట్ గా ఉండే  లోదుస్తులను మాత్రమే   ఎంచుకోవాలి. అలా కాకుండా  చిన్న సైజు తీసుకుని  వేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు.చర్మ సమస్యలు కూడా వెంటాడుతాయి. కాబట్టి సైజు విషయం లో ఎప్పుడు జాగ్రత్త అవసరం.

అందమైన లోదుస్తులు

చాలా మంది   అందంగా ఉండే  లోదుస్తులను వాడడానికి ఇష్టపడుతుంటారు.  అంత అందమైన లోదుస్తులు కోసం వాడే క్లాత్  సాటిన్, లేస్ మొదలైన వాటితో తయారు చేయబడతాయి.  వీటిని  వేసుకోవడం వల్ల చర్మ సంబంధ  సమస్యలు వస్తాయి. కాబట్టి లోదుస్తులు  ఎప్పుడూ   చర్మానికి ఎటువంటి సమస్య కలుగ చేయని   మెటీరియల్ తో తయారు చేయబడిన వాటిని   సెలెక్ట్ చేసుకోవాలి.

సెంటెడ్ డిటర్జెంట్
లోదుస్తులు సెంటెడ్ డిటర్జెంట్  వాడి ఉతకడం వల్ల   వాటిని వేసుకున్న తర్వాత    కెమికల్స్ చర్మానికి  ఇబ్బందిగా మారతాయి.  ఇలా ఉతికి వేసుకోవడం వల్ల వెజినల్ ఇన్ఫెక్షన్స్  వస్తాయి.  కాబట్టి లోదుస్తుల విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకండి.. సౌకర్యం గా హాయిగా ఉండే వాటిని  వేసుకోవడం చాలా మంచిది.

 

 


Share

Related posts

Corona Virus: కరోనా బాధితులకు ఊరటగా కేంద్రం కీలక ఆదేశాలు

somaraju sharma

Manchu Manoj: పెళ్ళి కొడుకు కాబోతున్న మంచు మనోజ్…అమ్మయి ఎవరంటే??

Naina

నిద్ర‌లేని రాత్రుల్లు గ‌డ‌పండి…నేను అదే చేస్తున్న… వాళ్ల‌తో చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

sridhar